HomeLATESTఉస్మానియా యూనివర్సిటీలో సివిల్స్​ అకాడమీ

ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్స్​ అకాడమీ

ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్​ సర్వీసెస్​ అకాడమీ ఏర్పాటు ప్రతిపాదనలకు పాలక మండలి ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన రోడ్​మ్యాప్​ను సిద్ధం చేశారు. యూనివర్సిటీ బడ్జెట్​లో నిధుల కేటాయింపు తర్వాత అకాడమీ ఏర్పాటుకు నోటిఫికేషన్​ విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే అకాడమీ సంబంధించి డైరెక్టర్​గా ప్రొఫెసర్​ గణేశ్​, కోఆర్డినేటర్​గా డాక్టర్​ సుజాతను నియమించారు. వివిధ సబ్జెక్టుల్లో అపారమైన అనుభవం కలిగిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్​ ప్రొఫెసర్లను ఈ అకాడమీలో నియమించనున్నారు. ప్రతి బ్యాచ్​లో దాదాపు 200 మంది అభ్యర్థులకు ప్రిలిమ్స్​, మెయిన్స్​కు ఏడాది పాటు తరగతులు నిర్వహించనున్నారు.

Advertisement

ఈ అకాడమీ నిర్వహణకు సంబంధించి సుమారు రూ. 50లక్షల నుంచి కోటి వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. వీటికోసం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిధులను వినియోగించుకోవాలని నిర్ణయించారు. సివిల్​ అకాడమీ నిర్వహణకు నిధులతో పాటు అవసరమైన బోధనా వ్యవహారాలపై అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2022 సివిల్స్​ సర్వీసెస్​ నోటిఫికేషన్​ ఇటీవలే వెలువడింది. వీలైతే ఈ బ్యాచ్​ నుంచే అకాడమీ ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు వేగవంతం చేశారు. లేని పక్షంలో ఈ ఏడాది జూన్​ నుంచి ప్రారంభించి వచ్చే సివిల్స్​ నోటిఫికేషన్​కు అభ్యర్థులకు తగిన శిక్షణ అందించేలా అకాడమీని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.

సివిల్స్​ నోటిఫికేషన్ 2022​ విడుదలైంది.. ఎలా అప్లై చేయాలి.. ఎలా ప్రిపేర్​ కావాలి

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!