కరోనా మరోసారి విజృంభిస్తుండడంతో చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూసివేస్తున్నారు. పరీక్షలు రద్దు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సివిల్స్ 2021 మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎగ్జామ్ ఉంటుందో, వాయిదో వేస్తారో అనే డైలమాలో ఉన్నారు. ఈ సందర్భంగా యూపీఎస్సీ ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. దేశం లో ఉన్న కొవిడ్ పరిస్థితి పూర్తిగా సమీక్షించిన మీదట మెయిన్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని అనుకున్నట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వెబ్సైట్లో అప్డేట్ ఇచ్చింది. జనవరి 7,8,9,15,16 తేదీల్లో మెయిన్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి.అభ్యర్థులకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్రాలని యూపీఎస్సీ కోరింది.
