Homeవార్తలుసివిల్స్​ 2021 నోటిఫికేషన్​: 24 లాస్ట్​ డేట్​.. డోంట్​ మిస్​

సివిల్స్​ 2021 నోటిఫికేషన్​: 24 లాస్ట్​ డేట్​.. డోంట్​ మిస్​

సివిల్ సర్వీసెస్‍ 2021 నోటిఫికేషన్​ను యూపీఎస్సీ రిలీజ్​ చేసింది. ఈసారి మొత్తం 712 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇండియన్‍ బ్యూరోక్రసీలో అత్యున్నతమైన ఐఏఎస్‍, ఐపీఎస్‍, ఐఎఫ్‍ఎస్‍ లాంటి కేంద్ర సర్వీసులకు నిర్వహించే పరీక్ష కావటంతో లక్షలాది మంది ఎదురుచూస్తున్న ఈ నోటిఫికేషన్​కు ఎలా అప్లై చేయాలి.. ఎలా ప్రిపేర్​ కావాలి.. పూర్తి వివరాలు..?

Advertisement

సివిల్స్​ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం డిగ్రీ పాసై ఉండాలి. డిగ్రీ ఫైనల్​ ఇయర్​ చదువుతున్న క్యాండిడేట్స్​ కూడా అప్లై చేసుకోవచ్చు.

ప్రిలిమ్స్​లో పాస్​ అయితే మెయిన్స్​కు అప్లై చేసేటపుడు వారు డిగ్రీ సర్టిఫికేట్​ సమర్పించాలి. జనరల్‍ అభ్యర్థులు 6 సార్లు, ఓబీసీలు 9, దివ్యాంగులు 9 సార్లు పరీక్ష రాసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు అటెంప్ట్స్ పై పరిమితి లేదు.

వయసు: జనరల్​ కేటగిరీ అభ్యర్థులకు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 35 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 37 ఏండ్ల వరకు ఎగ్జామ్​ రాసే ఛాన్స్​ ఉంటుంది. వికలాంగులకు గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు.
ఫీజు: జనరల్​ అభ్యర్థులకు రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‍ క్యాండిడేట్స్​కు ఫీజు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.
చివరితేది: 24 మార్చి 2021
ప్రిలిమ్స్ ఎగ్జామ్​: 27 జూన్ ​2021
వెబ్‌సైట్: www.upsc.gov.in

ఎగ్జామ్​ ప్యాటర్న్​:

సివిల్స్ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల్లో జరుగుతుంది.

ప్రిలిమినరీ పరీక్షలో జనరల్‍ స్టడీస్‍ (పేపర్-1), సివిల్‍ సర్వీసెస్‍ ఆప్టిట్యూడ్‍ టెస్ట్ (పేపర్-2) ఆబ్జెక్టివ్‍ పద్ధతిలో నాలుగు వందల మార్కులకు ఉంటాయి. సమయం రెండు గంటలు

పేపర్‍ 2 క్వాలిఫైయింగ్‍ పేపర్‍. దీనిలో కనీసం 33 శాతం మార్కులు రావాలి. ప్రిలిమ్స్ మార్కులను మెరిట్‍లో పరిగణనలోకి తీసుకోరు. నెగెటివ్‍ మార్కింగ్‍ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.33 శాతం కోత విధిస్తారు.

మెయిన్స్​లో డిస్క్రిప్టివ్​ రాత పరీక్ష, ఇంటర్వ్యూ కలిపి ఉంటాయి.
రాత పరీక్షలో కన్వెన్షనల్‍ (ఎస్సే) పద్ధతిలో మొత్తం 9 పేపర్లుంటాయి.
వీటిలో రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న భాషతో పాటు ఇంగ్లిష్ అనే రెండు లాంగ్వేజ్‍ పేపర్లు ఉంటాయి. ఇవి క్వాలిఫైయింగ్‍ పేపర్లు మాత్రమే.
వీటిలో అర్హత మార్కులు సాధిస్తేనే మిగిలిన జీఎస్‍ పేపర్లు వాల్యుయేషన్‍ చేస్తారు.

వీటితో పాటు ఏడు కంపల్సరీ పేపర్లుంటాయి. మెయిన్స్ లో 26 సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టును ఆప్షనల్‍గా ఎంచుకోవచ్చు. చివరి దశలో 275 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. సివిల్స్ పరీక్ష మొత్తం 2075 మార్కులకు నిర్వహిస్తారు. ఫైనల్​గా సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు సర్వీస్​ కేటాయిస్తారు.

ప్రిలిమ్స్​ సిలబస్
పేపర్-1
⦁ జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు
⦁ భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమం
⦁ భారత, ప్రపంచ భౌగోళికశాస్త్రం – ప్రపంచ, భారత దేశ భౌతిక, సామాజిక, ఆర్థిక భౌగోళిక శాస్త్రం
⦁ భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలన – రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయతీరాజ్, పౌర విధానం, హక్కుల సమస్యలు, తదితర అంశాలు
⦁ ఆర్థిక, సామాజిక అభివృద్ధి – సమ్మిళిత అభివృద్ధి, పేదరికం, ద్రవ్యోల్బణం, డెమోగ్రాఫిక్స్, సామాజిక రంగ కార్యక్రమాలు
⦁ పర్యావరణం, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు- సాధారణ అంశాలు
⦁ జనరల్ సైన్స్

పేపర్-2
⦁ కాంప్రెహెన్షన్
⦁ ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ ఇన్‍క్లూడింగ్‍
⦁ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ
⦁ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్
⦁ జనరల్ మెంటల్ ఎబిలిటీ
⦁ బేసిక్ న్యూమరసీ (పదోతరగతి స్థాయి)
⦁ డేటా ఇంటర్‌ప్రిటేషన్

Advertisement

కంబైన్డ్​ ప్రిపరేషన్​
సివిల్స్ రాసే అభ్యర్థులు మొదటి నుంచే ప్రిలిమ్స్​తో పాటే మెయిన్స్​పై కూడా ఫోకస్​ చేయాలి.

ఆప్షనల్ కీలకం
ఆప్షనల్​లో రెండు పేపర్లకు లోతైన ప్రిపరేషన్ అవసరం. అభ్యర్థులు సిద్ధం చేసుకున్న సొంత మెటీరియల్​ను ఎక్కువసార్లు రివిజన్​ చేయాలి. ఏ ఒక్క చాప్టర్​ వదిలిపెట్టకుండా చదవాలి. ఆప్షనల్ సబ్జెక్టు ఏదైనా పీజీ స్థాయిలో ప్రిపరేషన్​ ఉంటేనే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.

తెలుగులోను సర్వీస్​ సాధించవచ్చు
ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాం, ఇంగ్లిష్‌లో మాట్లాడటం రాదు. రాయడం అంతత మాత్రమే.. సివిల్స్ సాధించలేమనే అపోహ చాలా మందిలో ఉంటుంది. ప్లాన్​ ప్రకారం ప్రిపేర్​ అయితే తెలుగు మీడియంలో పరీక్ష రాసి మంచి సర్వీస్​ సాధించవచ్చు.

RECENT POSTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

REASONING

DAILY TESTS

CURRENT AFFAIRS

రివిజన్ నోట్స్

హైదరాబాద్ లో భారీ జాబ్ మేళా.. 100 కంపెనీల్లో 10 వేల జాబ్స్.. వెంటనే రిజిస్టర్ చేసుకోండిలా..

హైదరాబాద్ లోని నిరుద్యోగులకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఏప్రిల్ 2న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ జాబ్ మేళా ద్వారా 100 కంపెనీల్లో...

తెలంగాణ పాటలు‌‌ రచయితలు: రివిజన్​ నోట్స్ 5

పల్లెటూరి పిల్లగాడపసులకాడి మొనగాడపాలుమరచి ఎన్నాళ్లయిందోఓ…. పాలబుగ్గల జీతగాడా!!!సుద్దాల హన్మంతుబండెనక బండి గట్టి - పదహారెడ్లబండికట్టిబండి యాదగిరి:రాజిగ - ఓ రాజిగ పుడితె ఒకడుచస్తే రెండుఊరు మనదిరా వాడమనదిరాగూడ అంజన్న. ఇద్దరం విడిపోతే భూమిబద్దలవుతుందా…'పల్లె...

తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్​ నోట్స్ 4

ఉద్యమం నాటి పుస్తకాలు - రచయితలు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్​ ప్రొఫెసర్​ జయశంకర్​తెలంగాణలో ఏం జరుగుతోందిప్రొఫెసర్​ జయశంకర్​'ఎ రిబట్టర్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగండ' కొణతం దిలిప్ తెలంగాణ విద్యతెలంగాణ విద్యావంతుల...

నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు… తెలంగాణ రివిజన్​ నోట్స్ 3

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 2

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 1

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

భక్తి.. సూఫీ ఉద్యమాలు

భక్తి, సూఫీ ఉద్యమాల నుంచి అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే అభ్యర్థుల ప్రిపరేషన్​కు ఉపయోగపడే విధంగా రన్నింగ్​ నోట్స్​ ఇక్కడ అందిస్తున్నం.శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యలను త్రిమతాచార్యులు అంటారు. వీరి రాకతో...

భారత దేశ సరిహద్దులు.. సంబంధాలు

పోటీ పరీక్షల్లో ఇండియన్​ జాగ్రఫీ కీలకం. అందులో భారత ఉనికి.. స్వరూపం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశముంటుంది. సరిహద్దులు.. ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు, వివాదాలపై తప్పనిసరి ప్రశ్నలు అడిగే...

తెలంగాణ ప్రభుత్వ పథకాలు

తెలంగాణకు హరితహారం: రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణంలో 24 శాతం నుంచి 33శాతానికి పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన కార్యక్రమం ‘కోతులు వాపస్​ పోవాలి వానలు వాపస్​ రావాలె’ అనే నినాదంతో 2015 జులై...

భారతదేశంలో బ్రిటీష్ గవర్నర్​ జనరల్స్​

వారన్​ హేస్టింగ్స్​ 1772 నుంచి 1774 వరకు బెంగాల్​ చివరి గవర్నర్ గా పనిచేశారు. 1774 నుంచి ఈస్ట్​ ఇండియా కంపెనీటి మొదటి గవర్నర్​ జనరల్​ లేదా తొలి గవర్నర్​ జనరల్​...

తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు

1983 తెలంగాణ డెమోక్రటిక్​ ఫ్రంట్​ సత్యనారాయణ1985 ఫిబ్రవరి 27 తెలంగాణ జనసభ దుశ్చర్ల సత్యనారాయణ1987 తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి1989 తెలంగాణ పోరాట సమితి కె.ఆర్.​ ఆమోస్​, మేచినేని కిషన్​రావు1990 తెలంగాణ...

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!