సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కానిస్టేబుల్ (ఫైర్మెన్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. మొత్తం 1149 ఖాళీలున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణ-30, ఆంధ్రప్రదేశ్-79.
అర్హత: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 4 మార్చి 2022 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
సాలరీ: పే లెవల్-3 ప్రకారం నెలకి రూ.21,700 – 69,100 + ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: పీఈటీ/ పీఎస్‌టీలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని రాత పరీక్షకి ఎంపిక చేస్తారు. దీన్ని ఓఎంఆర్/ కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటుంది. దీన్ని ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు. పరీక్షా సమయం 120 నిమిషాలు.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్, ఇంగ్లిష్/ హిందీ సబ్జెక్టుల 25 మార్కుల చొప్పున ప్రశ్నలుంటాయి.
అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కు ఫీజు లేదు.
అప్లికేషన్లకు చివరి తేది: 4 మార్చి
వెబ్సైట్: www.cisfrectt.in