HomeLATESTడిగ్రీ సెమిస్టర్​ పరీక్షల మోడల్ మారింది​

డిగ్రీ సెమిస్టర్​ పరీక్షల మోడల్ మారింది​

డిగ్రీ సెమిస్టర్​ పరీక్షల్లో ఛాయిస్​ ప్రశ్నలు పెంచాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈమేరకు అన్ని యూనివర్సిటీలకు తగిన సూచనలు చేసింది. రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీల వైస్​ చాన్స్​లర్లలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్​ ఆచార్య ఆర్​ లింబాద్రి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సెమిస్టర్​ పరీక్షల నిర్వహణతో పాటు చాయిస్​ ప్రశ్నలపై చర్చ జరిగింది. కరోనా కారణంగా క్లాసులు సరిగా జరగకపోవటంతో పరీక్షల్లో విద్యార్థులకు ఛాయిస్​ ప్రశ్నలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.

డిగ్రీ పరీక్షల్లోని ప్రశ్నాపత్రాల్లో ‘సెక్షన్​ బీ’ లో ఏ లేదా బీ రాయండి అనే నిబంధనను మార్చి ‘ ఇచ్చిన ప్రశ్నల్లో మీకిష్టమైన వాటికి సమాధానాలు రాయండి’ అని మార్చాలని నిర్ణయించారు. దీంతో విద్యార్థులకు సెమిస్టర్​ పరీక్షల్లో ఛాయిస్​ పెరగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష సమయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని.. 3 గంటల్లో పరీక్ష పూర్తి చేయాలని తెలిపారు.

డిగ్రీ ఫస్ట్​ సెమిస్టర్​కు ఫిబ్రవరి 17 వరకు క్లాసులు నిర్వహించి 18 నుంచి 25వరకు ప్రిపరేషన్​ హాలిడేస్​, ప్రాక్టికల్స్​ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28నుంచి మార్చి 24 వరకు సెమిస్టర్ పరీక్షలు జరపాలని నిర్ణయించారు.

వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల్లో పలు కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకోసం సీపీగేట్​ కౌన్సెలింగ్​ మరోసారి జరపాలని మీటింగ్​లో నిర్ణయించారు. ఇప్పటికే మూడు విడతల్లో కౌన్సెలింగ్​ నిర్వహించగా మిగిలిన సీట్ల భర్తీకి నిర్వహించే ఈ చివరి కౌన్సెలింగ్​ను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు కోరారు.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!