ఇండియన్ రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. సెంట్రల్ రైల్వే దేశవ్యాప్తంగా వివిధ వర్క్‌షాప్‌లు, డిపోలలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,418 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటి కోసం అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు టెన్త్, ఐటీఐ అర్హత కలిగి ఉండాలి. 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ముంబై, భుసావల్, పూణే, నాగ్‌పూర్, సోలాపూర్ డివిజన్‌లలోని వివిధ ట్రేడ్‌లలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టైలర్ వంటి ట్రేడ్స్‌కు ఎక్కువ ఖాళీలు ఉన్నాయి.
ముంబై క్లస్టర్: 1,649 పోస్టులు
భుసావల్ క్లస్టర్: 418 పోస్టులు
పూణే క్లస్టర్: 101 పోస్టులు
నాగ్‌పూర్ క్లస్టర్: 148 పోస్టులు
సోలాపూర్ క్లస్టర్: 76 పోస్టులు
అర్హత:
ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు 10వ తరగతిలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు.. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయస్సు:
అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు కూడా వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఫీజు:
అప్లికేషన్ ఫీజు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనికి ఎలాంటి రాత పరీక్ష కానీ, ఇంటర్వ్యూ కానీ ఉండదు.
అప్లికేషన్ విధానం:
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
ముందుగా సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ https://rrccr.com/ లోకి లాగిన్ అవ్వండి.
“Recruitment” సెక్షన్‌లో “Apprentice 2025” నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయండి.
లింక్ ఓపెన్ చేసి, పూర్తి వివరాలు చదివి, “Apply Online” బటన్‌పై క్లిక్ చేయండి.
అవసరమైన వివరాలను ఎంటర్ చేసి, అప్లికేషన్ ఫారం పూర్తి చేయండి.
సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించండి.
చివరగా..అప్లికేషన్ ఫారంను సబ్మిట్ చేసి, ప్రింటవుట్ తీసుకోండి.





