బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ పోస్టుల అప్లికేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి 3 కాగా తాజాగా దీనిని 15వతేదీ వరకు పొడిగించారు. ఇదిలా ఉంటే.. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టుల పూర్తి వివరాలు:
మొత్తం: 350 ఖాళీలు
విభాగాల వారిగా..
మార్కెటింగ్ ఆఫీసర్ (Scale I): 300 పోస్టులు
ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఆఫీసర్ (Scale III): 50 పోస్టులు
అర్హతలు:
మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులు: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు మార్కెటింగ్ స్పెషలైజేషన్‌తో MBA లేదా PGDM కలిగి ఉండాలి. అలాగే రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి.
ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఆఫీసర్ పోస్టులు : ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉండాలి. CA/CFA/MBA ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఆపరేషన్స్‌లో కనీసం 5 ఏళ్ల అనుభవం అవసరం.
వయస్సు:
మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు 22 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఆఫీసర్ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ , ఓబీసీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
జీతం:
మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులు( Scale-I) (Marketing): రూ. 48,480 – రూ.85,920 (జీతం + అలవెన్సులు) వరకు ఉంటుంది.
ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఆఫీసర్ పోస్టులు( Scale III): రూ. 85,920 – రూ.1,05,280 వరకు ఉంటుంది.
ఎంపిక విధానం: అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఫిబ్రవరి లేదా మార్చి నెలలో నిర్వహించే అవకాశం ఉంది.
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ/మహిళలు/దివ్యాంగ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ. 175 +జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర అభ్యర్థులు రూ. 850 + జీఎస్టీ చెల్లించాలి.
అప్లికేషన్ విధానం:
అర్హత గల అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ centralbankofindia.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.





