బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎఎస్‌బీ కేంద్ర సాయుధ బలగాల్లోని అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సీఏపీఎఫ్-2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 253 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే 10వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి.
పోస్టులు: బీఎస్ఎఫ్– 66, సీఆర్‌పీఎఫ్– 29, సీఐఎస్ఎఫ్– 62, ఐటీబీపీ– 14, ఎస్ఎస్‌బీ– 82 ఖాళీలు ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై 2022లో డిగ్రీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సీఏపీఎఫ్ పరీక్ష 2022కి ఫిజికల్ మెజర్మెంట్స్ ఉండాలి. రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్/ ఎఫిషియన్సీ టెస్టులు, ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్: ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నాం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. పేపర్-1లో జనరల్ ఎబిలిటీ, ఇంటలిజెన్స్ విభాగాలు ఉంటాయి. దీన్ని 250 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ఉంటాయి. ఇంగ్లిష్, హిందీ మీడియంలో ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2లో జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ విభాగాలు ఉంటాయి. దీన్ని 200 మార్కులకు నిర్వహిస్తారు. ఆగస్టు 7వ తేదీన రాతపరీక్ష ఉంటుంది. పూర్తి సమాచారం కోసం www.upsc.gov.in వెబ్సైట్ సంప్రదించాలి.