సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్), బెంగళూర్, 280 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వీటిలో డిజైన్ ఇంజనీర్, సీనియర్ డిజైన్ ఇంజనీర్, టెక్నికల్ మేనేజర్, సీనియర్ టెక్నికల్ మేనేజర్, చీఫ్ టెక్నికల్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ రీసెర్చ్ (ఏసీఆర్) ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్)
మొత్తం ఖాళీలు: 280
పోస్టులు: డిజైన్ ఇంజనీర్, సీనియర్ డిజైన్ ఇంజనీర్, టెక్నికల్ మేనేజర్, సీనియర్ టెక్నికల్ మేనేజర్, చీఫ్ టెక్నికల్ మేనేజర్
అధికారిక వెబ్‌సైట్: www.cdac.in
అర్హతలు: బీ.ఈ./బీ.టెక్, ఎం.ఎస్సీ, ఎం.ఈ./ఎం.టెక్, ఎంసీఏ, ఎం.ఫిల్/పీహెచ్‌డీ అర్హత కలిగి ఉండాలి. పోస్టులను బట్టి విద్యార్హత ఉంటుంది.
వయస్సు: పోస్టును బట్టి 35 నుంచి 56 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అనుభవం: పోస్టును బట్టి సంబంధిత రంగంలో అనుభవం అవసరం.
ఎంపిక విధానం: అభ్యర్థుల అకడమిక్ రికార్డులు, అప్లికేషన్‌లో అందించిన సమాచారం ఆధారంగా స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులు డాక్యుమెంట్లతో వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు అనుభవం, పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం అందిస్తారు. సీడాక్ ప్రాజెక్ట్ ఇంజనీర్‌లకు సంవత్సరానికి రూ. 4.49 లక్షల నుంచి రూ. 7.11 లక్షల వరకు జీతం ఉంటుంది. ఇతర పోస్టులకు జీతం రూ. 37,500 నుంచి రూ. 1,10,000 వరకు ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభ, చివరితేదీ: అప్లికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ చెక్ చేయవచ్చు.





