భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్’ చక్కటి అవకాశాన్ని తీసుకొచ్చింది. గ్రూప్-A, B, C విభాగాల్లో ఖాళీగా ఉన్న 179 ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ , ఐటీఐ, డిగ్రీ, నర్సింగ్ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు:
MTS (43 పోస్టులు): 10 టెన్త్ లేదా ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
UDC & LDC (57 పోస్టులు): UDC పోస్టుకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, LDCపోస్టుకు ఇంటర్ తో పాటు కంప్యూటర్ టైపింగ్ సామర్థ్యం ఉండాలి.
స్టాఫ్ నర్స్ (07 పోస్టులు): బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎమ్డిప్లొమా పూర్తి చేసి రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
రీసెర్చ్ ఆఫీసర్ & ఇతర పోస్టులు: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులలో పీజీ, ఎం.డి లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
పోస్టును బట్టి వయోపరిమితి 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు గరిష్ట వయస్సులో సడలింపులు వర్తిస్తాయి. 7వ వేతన సంఘం ప్రకారం పే లెవెల్-1 (రూ. 18వేల) నుంచి పే లెవెల్-10 (రూ. 1,77,500) వరకు జీతం అందుతుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది. కొన్ని గ్రూప్-A పోస్టులకు రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. పోస్టుల స్వభావాన్ని బట్టి ఎల్డీసీ, స్టెనో వంటి ఉద్యోగాలకు స్కిల్ / టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.





