సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (CCRAS)..గ్రూప్ A, B, C పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 394 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), స్టెనోగ్రాఫర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ తో పాటు ఇతర పోస్టులు కూడా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన వివరాలు:
మొత్తం పోస్టులు: 394
పోస్టుల రకాలు: గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్ విధానంలో అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభ తేదీ: ఆగస్టు 1 నుంచి అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి.
చివరి తేదీ: ఆగస్టు 31 వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్: https://ccras.nic.in/
విద్యార్హతలు:
పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగి ఉండాలి. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు.
వయస్సు:
పోస్టులను బట్టి వయోపరిమితి మారుతుంది. సాధారణంగా 27 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పోస్టును బట్టి ఉంటుంది. సాధారణంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఉంటుంది. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ కూడా ఉంటాయి.
ఎలా అప్లై చేయాలి?
1.ముందుగా CCRAS అధికారిక వెబ్‌సైట్ ccras.nic.in లోకి వెళ్లండి.
2.హోమ్‌పేజీలో “Recruitment” లేదా “Careers” సెక్షన్‌కి వెళ్ళండి.
3.సంబంధిత రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 04/2025) పై క్లిక్ చేయండి.
4.నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదివి, అర్హతలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
5.తర్వాత “Apply Online” లింక్‌పై క్లిక్ చేసి, అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.
6. అవసరమైన డాక్యుమెంట్లు, అప్ లోడ్ చేసి.. అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
7. తర్వాత సబ్మిట్ చేసి.. ప్రింటౌట్ తీసుకోండి.
మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ccras.nic.in చెక్ చేయవచ్చు.





