సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) టర్మ్-2 బోర్డ్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 26 నుంచి జరుగనున్నాయి. 10, 12 తరగతులకు రెండో విడత బోర్డు పరీక్షలను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. టర్మ్-2లో ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ తరహా ప్రశ్నలుంటాయని సీబీఎస్‌ఈ తెలిపింది. పరీక్షల తేదీల వివరాలను త్వరలో వెబ్‌సైట్‌లో ఉంచుతామని పేర్కొంది. టర్మ్-2 బోర్డు పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్‌ను గత నెలలోనే వెబ్‌సైట్‌లో పొందుపరిచిన విషయం తెలిసిందే.
త్వరలో టర్మ్ 1 రిజల్ట్స్
కరోనా నేపథ్యంలో 10, 12 తరగతులకు బోర్డు పరీక్షల విధానాన్ని సీబీఎస్‌ఈ తొలిసారి మార్చింది. ఈ విద్యా సంవత్సరంలో రెండు దఫాలుగా బోర్డు పరీక్షలు నిర్వహిస్తామని ముందుగానే ప్రకటించింది. ఇందులో భాగంగా షెడ్యూల్ ప్రకారం గత ఏడాది నవంబర్-డిసెంబర్ మధ్యలో టర్మ్ 1 బోర్డు పరీక్షలను నిర్వహించింది. టర్మ్-1 పేపర్లలో ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్ తరహా ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు. అయితే వీటి ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.