సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఈ సప్లిమెంటరీ పరీక్షలు జులై 15 నుంచి ప్రారంభం కానున్నాయి.
అడ్మిట్ కార్డులు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ?
1.CBSE అధికారిక వెబ్సైట్ (cbse.gov.in) లోకి లాగిన్ అవ్వండి.
2.హోమ్ పేజ్‌లో “Private Candidates” లింక్‌పై క్లిక్ చేయండి.
3.”CBSE Board Supply Admit Card 2025″ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
4.మీ లాగిన్ వివరాలను (అప్లికేషన్ నంబర్, రోల్ నంబర్ లేదా మీ పేరు, తల్లిదండ్రుల పేర్లు) ఎంటర్ చేయండి.
5. మీ అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకొని ప్రింటవుట్ తీసుకోండి.
రెగ్యులర్ విద్యార్థులు:
రెగ్యులర్ విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను సంబంధిత పాఠశాలల నుంచి తీసుకోవచ్చు. లాగిన్ వివరాలతో అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేస్తారు.
పరీక్షల తేదీలు:
10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు: జులై 15 నుంచి జులై 22 వరకు.
12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు: జులై 15 న (ఒకే రోజు).
ప్రాక్టికల్ పరీక్షలు: జులై 10 నుంచి జులై 15 వరకు జరుగుతాయి.
సూచనలు:
విద్యార్థులు పరీక్షా కేంద్రానికి అడ్మిట్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి.
పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి కనీసం అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్ష హాలులోకి అనుమతించరు.
పరీక్ష సమయం, సబ్జెక్టులకు సంబంధించిన వివరాలు అడ్మిట్ కార్డుపై స్పష్టంగా ఉంటాయి.





