HomeLATESTసీబీఎస్​ఈ ఎగ్జామ్స్​ పాత మోడల్​లోనే..

సీబీఎస్​ఈ ఎగ్జామ్స్​ పాత మోడల్​లోనే..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్​ (CBSE) బోర్డు పరీక్షల్లో కీలక మార్పుల్ని ప్రకటించింది. మళ్లీ యాన్యువల్ ఎగ్జామ్ పద్ధతికి మారుతున్నట్టు ప్రకటించింది. కరోనా కారణంగా 2021–2022 బ్యాచ్ విద్యార్థులకు రెండు టర్మ్​లుగా పరీక్షలు నిర్వహించింది. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే టర్మ్ 1 పరీక్షలు ముగిశాయి. టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26న ప్రారంభం కానున్నాయి. ఈ బ్యాచ్ విద్యార్థులకు మాత్రమే రెండు టర్మ్ పరీక్షలు ఉంటాయని.. వచ్చే బ్యాచ్​కు యథాతథంగా యాన్యువల్​ పరీక్షలు ఒకటేసారి ఉంటాయని ప్రకటించింది. కరోనా తగ్గిపోవటంతో రెండు టర్మ్‌ల పరీక్షల విధానాన్ని తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సిలబస్‌లో కూడా సీబీఎస్​ఈ బోర్డు పలు మార్పులు చేసింది. గత ఏడాది కరోనా ఎఫెక్ట్ తో 30 శాతం సిలబస్​ను సీబీఎస్​ఈ తగ్గించింది. దాని ప్రకారమే పరీక్షల్ని నిర్వహించింది. వచ్చే అకడమిక్​ ఇయర్​ నుంచి తిరిగి పాత సిలబస్ ప్రకారమే పరీక్షల్ని నిర్వహించనుంది. కొన్ని చాప్టర్స్‌లో మాత్రమే మార్పులు చేసినట్లు ప్రకటించింది.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!