యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 28వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత: బీఈ, బీటెక్ (కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ టెక్నాలజీ). లేదా బ్యాచిలర్ డిగ్రీ (కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణతతో రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా మాస్టర్స్ డిగ్రీ (కంప్యూటర్ అప్లికేషన్/ కంప్యూటర్ సైన్స్) లేదా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (కంప్యూటర్ అప్లికేషన్ స్పెషలైజేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు జనరల్ అభ్యర్థులకు 30 ఏండ్లు, ఓబీసీలు 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలు 35 ఏళ్లు మించకూడదు.
సెలెక్షన్ ప్రాసెస్: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు నవంబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ.25 (మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) చెల్లించాలి. పూర్తి వివరాలకు www.upsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.