Featured
Featured posts
ఇండియన్ బ్యాంక్‌లో 312 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
చెన్నై ప్రధానకేంద్రంగా ఉన్న ఇండియన్ బ్యాంక్ వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. మొత్తం 312 పోస్టులకు ఆన్లైన్లో జూన్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్లు, మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, చీఫ్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. పోస్టుల్ని అనుసరించి 23 నుంచి -40 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా...
పాలిసెట్‌కు ఎలా అప్లై చేయాలంటే (స్టెప్ బై స్టెప్)
TS POLYCET 2022 తెలంగాణ పాలిసెట్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. విద్యార్థులు ఆన్లైన్లో అప్లికేషన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూన్ 4వ తేదీ వరకు తుది గడువు ఉంది. పాలిసెట్ అప్లై చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా టెన్త్ హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. 2022 టెన్త్ ఎగ్జామ్ హాల్ టికెట్లను ప్రభుత్వం పరీక్షల విభాగం ఇటీవలే జారీ చేసింది. దీంతో పాలీసెట్‌కు అప్లై చేసే విద్యార్థులు తప్పనిసరిగా టెన్త్ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసే...
పాలిసెట్ కు ఎలా అప్లై చేయాలంటే..
తెలంగాణ పాలిసెట్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. అప్లై చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా టెన్త్ హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. 2022 టెన్త్ ఎగ్జామ్ హాల్ టికెట్లను ప్రభుత్వం పరీక్షల విభాగం ఇటీవలే జారీ చేసింది. దీంతో పాలీసెట్‌కు అప్లై చేసే విద్యార్థులు తప్పనిసరిగా టెన్త్ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ల అఫిషియల్ వెబ్‌సైట్‌కు ఈ లింక్ మీద క్లిక్ చేయండి. CLICK HERE TO APPLY FOR TS POLYCET 2022
టీఎస్ పాలిసెట్-2022 దరఖాస్తు విధానం
స్టెప్-1: టీఎస్ పాలిసెట్ అధికారిక వెబ్సైట్ https://polycetts.nic.in/...
పాలిసెట్ అప్లికేషన్లు ఓపెన్ కావట్లే.. అసలు కారణమేంటి..?
తెలంగాణ పాలిసెట్ అప్లికేషన్ల ప్రక్రియ ఈనెల 9 నుంచే ప్రారంభమవుతుందని టెక్నికల్ బోర్డు ప్రకటించింది. కానీ.. తొలి రోజున అప్లికేషన్ల సైట్ ఓపెన్ కాలేదు. రెండో రోజు కూడా సైట్ ఓపెన్ కాకపోవటంతో టెన్త్ విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. స్టేట్ టెక్నికల్ బోర్డు ఇప్పటివరకు అప్లికేషన్ల సబ్మిట్ చేసే లింక్‌ను అందించకపోవటంతో ఈ సమస్య తలెత్తింది. పాలిసెట్ అఫిషియల్ వెబ్సైట్ ను ఓపెన్ చేస్తే.. TS POLYCET Online Application Submission will be available soon అనే మెసేజ్ ప్రత్యక్షమవుతుంది. మరోవైపు అప్లికేషన్ల...
నేటి నుంచి పాలిసెట్ అప్లికేషన్లు
తెలంగాణ పాలిసెట్ (TS POLYCET 2022) అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 9 నుంచి జూన్ 4 వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. రూ.100 ఫైన్‌తో జూన్ 5 వరకు అప్లై చేసేందుకు వీలు కల్పించారు. జూన్ 30న పాలిసెట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఎగ్జామ్ జరిగిన తర్వాత 12 రోజులకు రిజల్ట్ విడుదల చేస్తామని పాలీసెట్ కన్వీనర్ ప్రకటించారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల సీట్లతోపాటు ఆర్జీయూకేటీ (బాసర), అగ్రికల్చర్, హార్టికల్చర్,వెటర్నరీ యూనివర్సిటీల్లోని పలు కోర్సులకు పాలిసెట్ ర్యాంకుల ద్వారానే సీట్లను అలాట్ చేస్తారు.
CLICK HERE FOR THE...
జూన్ 30న పాలీసెట్
తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్–2022) షెడ్యూల్ రిలీజైంది. టెన్త్ పూర్తయిన విద్యార్థులు ఈ ఎంట్రన్స్ ద్వారా ఇంజినీరింగ్/నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు తెలంగాణ వెలర్నరీ యూనివర్సిటీ, అనుబంధ పాలిటెక్నికల్ కాలేజీల్లో ఈ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత: పదోతరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. కంపార్ట్మెంటల్ పద్ధతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.సెలక్షన్ ప్రాసెస్: కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మెరిట్ ఆధారంగా ఎంపికదరఖాస్తులు: ఏప్రిల్ రెండో వారం నుంచి.. జూన్ 4వ తేదీ...
పాలిటెక్నిక్ పేపర్లు లీక్.. రద్దయిన ఎగ్జామ్స్‌కు కొత్త టైమ్ టేబుల్
పాలిటెక్నిక్ పరీక్షలకు రద్దు చేసిన ప్రభుత్వం కొత్త టైమ్ టేబుల్ విడుదల చేసింది. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన పాలిటెక్నిక్ ఫైనలియర్ పరీక్షలను రద్దు చేసింది. ప్రశ్నాపత్రాలు లీకయినట్లు గుర్తించటంతో ఈ పేపర్లను తిరిగి నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రోజుల్లో జరిగిన పరీక్షల పేపర్లు లీకైనట్టు సమాచారం అందడంతో స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఆఫీసర్లు విచారణ చేపట్టారు. హైదరాబాద్ శివారులోని బాటసింగారంలో ఉన్న స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కాలేజీలో ఈ పేపర్లు లీకైనట్టు బయటపడింది. ఎలక్ట్రికల్...
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
ఇంటర్ పరీక్షల షెడ్యూలును తెలంగాణ ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. ఏప్రిల్ 20 వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలను నిర్వహించనుంది. మార్చి 23 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను నిర్వహించేలా షెడ్యూలు తయారు చేసింది. కోవిడ్ నేపథ్యంలో ఇంటర్మీడియేట్ అకాడమిక్ క్యాలెండర్ లో పలు మార్పులు చేసింది.
గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్, మార్చిలో థియరీ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. కానీ.. ఇప్పటికీ సిలబస్ పూర్తి కాకపోవడం, థర్డ్ వేవ్ కరోనా ఎఫెక్ట్ తో విద్యాసంస్థలకు జనవరిలో సెలవులు ఇవ్వటంతో ...
TS POLYCET 2021 Question Paper with Official Key
తెలంగాణ పాలీసెట్ 2021 పేపర్ TSPOLYCET 2021 Question PaperPDF: https://merupulu.com/wp-content/uploads/2021/07/TSPolycet-2021-Question-Paper.pdf
తెలంగాణ పాలీసెట్ 2021 పేపర్ అఫీషియల్ కీTSPOLYCET 2021 Question Paper Official Final KeyPDF:https://merupulu.com/wp-content/uploads/2021/07/POLYCET2021KEY.pdf
ఇంటర్ స్టూడెంట్లకు లెర్నింగ్ మెటీరియల్
ఇంటర్ ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్లు తప్పనిసరిగా చదవాల్సిన బెస్ట్ స్టడీ మెటీరియల్‌ను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాం. లెర్నింగ్ మెటిరీయల్ పేరుతో తెలంగాణ ఇంటర్ బోర్డు వీటిని ప్రత్యేకంగా రూపొందించింది. ఎంసెట్, నీట్, జేఈఈ పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వీటిని తయారు చేశారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి వీటిని డౌన్ లోడ్ చేసుకునే వీలుంది. విద్యార్థులకు వీలుగా వీటిని ఇక్కడ కూడా అందుబాటులో ఉంచాం. డౌన్లోడ్ చేసుకొని పక్కాగా ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్రారంభించండి.సబ్జెక్ట్‌పై క్లిక్ చేస్తే స్టడీ మెటీరియల్ పీడీఎఫ్ ఓపెన్...