దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లతో పాటు ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ కాలేజీల్లో ఎంబీఏ అడ్మిషన్స్‌కు క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్) నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 28న ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
క్యాట్ 2021 పరీక్ష ద్వారా విశాఖపట్నం, అహ్మాదాబాద్, బెంగళూరు, కలకత్తా, జమ్మూ, బోద్ గయ, ఉదయపూర్, తిరుచిరాపల్లి, కోజికాడ్, అమృత్‌సర్, రాయ్‌పూర్, నాగ్‌పూర్, కాశీపూర్, లక్‌నవూ, రాంచీ, రోహ్‌తక్, షిల్లాంగ్, ఇండోర్, సంబాల్‌పూర్, సిర్‌మౌర్ ఐఐఎం క్యాంపస్‌లలో ఎంబీఏ అడ్మిషన్లు పొందవచ్చు.
దరఖాస్తులు: ఆన్లైన్
అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.2200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కు రూ.110.
దరఖాస్తులు ప్రారంభం: 4 ఆగస్టు
చివరి తేది: 15 సెప్టెంబర్
ఎగ్జామ్: నవంబర్ 28వ తేదీన మూడు సెషన్లలో నిర్వహించనున్నారు
పరీక్ష ఫలితాలు: 2022 జనవరి రెండో వారంలో విడుదల చేయోచ్చు.
వెబ్సైట్: www.iimcat.ac.in
విద్యార్హత: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కనీసం 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసి రిజల్ట్ వెయిటింగ్ లో ఉన్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
ఎగ్జామ్ ప్యాటర్న్:
సెక్షన్ ప్రశ్నలు సమయం
వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ 26 40
డేటా ఇంటర్ ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ 24 40
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 26 40
మొత్తం 76 120
