కెనరా బ్యాంక్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగం దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా బ్యాంకు శాఖల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 4వ తేదీలోగా అప్లై చేసుకోవాలి.
అర్హత: మొత్తం 3,000 ఖాళీలకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. వయసు 1 సెప్టెంబర్ 2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ట్రైనింగ్ ఏడాది ఉంటుంది.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 4 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం www.canarabank.com వెబ్సైట్లో సంప్రదించాలి.