ప్రభుత్వ రంగంలో సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ విభాగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) దేశవ్యాప్తంగా ఉన్న తన వివిధ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 805 ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్‌తో పాటు ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 56 ఏళ్ల వయస్సులోపు ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థులు ఫిబ్రవరి 20 వతేదీ వరకు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీలు: 805
హైదరాబాద్ (105 ఖాళీలు)
బెంగళూరు (93)
నోయిడా (283),
పూణే (65) వంటి ప్రధాన నగరాల్లో ఈ పోస్టులు భర్తీ కానున్నాయి.
అర్హతలు: అభ్యర్థులు కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్ లేదా ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ సైన్స్, ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వంటి విభాగాల్లో డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు కూడా కొన్ని ప్రత్యేక పోస్టులకు అర్హులు.
వయస్సు: 56 ఏళ్లలోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ,దివ్యాంగులకు వయో సడలింపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా 5 ఏళ్ల వరకు సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం:
స్క్రీనింగ్: అభ్యర్థులు అప్లికేషన్‌లో సమర్పించిన అకడమిక్ రికార్డులు, అనుభవం ఆధారంగా ప్రాథమిక ఎంపిక జరుగుతుంది.
పరీక్ష/ఇంటర్వ్యూ: షార్ట్‌లిస్ట్ అయిన వారికి రాత పరీక్ష లేదా నేరుగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్: తుది ఎంపికలో ఒరిజినల్ సర్టిఫికేట్లను చెక్ చేస్తారు.
అప్లికేషన్లకు చివరి తేదీ: ఫిబ్రవరి 20 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూ తేదీలు: షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మెయిల్ ద్వారా ఇంటర్వ్యూ తేదీ తెలియజేస్తారు.
అప్లికేషన్ విధానం: ఆసక్తి గల అభ్యర్థులు సీ-డ్యాక్ అధికారిక వెబ్‌సైట్ cdac.in లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత ‘Careers’ విభాగంలో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.





