భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), మెరిటోరియస్ స్పోర్ట్స్‌పర్సన్ల కోసం కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 549 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో పురుషులకు 277 కేటాయించగా.. మహిళలకు 272 కేటాయించారు. టెన్త్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. డిసెంబర్ 27 నుంచి జనవరి 15 వరకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన వివరాలు :
సంస్థ: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF).
పోస్టు పేరు: కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) – స్పోర్ట్స్ కోటా.
మొత్తం ఖాళీలు: 549 (పురుషులు: 277, మహిళలు: 272).
అర్హతలు:
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
క్రీడా అర్హత: 15/01/2024 నుంచి 15/01/2026 మధ్య జరిగిన అంతర్జాతీయ లేదా జాతీయ పోటీలలో పతకాలు సాధించి ఉండాలి లేదా పాల్గొని ఉండాలి.
వయస్సు (18 ఆగస్టు 2025 నాటికి): అభ్యర్థుల కనిష్ట వయస్సు 18 ఏళ్లు కాగా.. గరిష్టంగా 23 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (NCL) అభ్యర్థులకు 3 ఏళ్ల వయో సడలింపు వర్తిస్తుంది.
విభాగాల వారీగా ఖాళీలు:
అథ్లెటిక్స్ (103), బాక్సింగ్ (30), ఫుట్‌బాల్ (21), హాకీ (10), స్విమ్మింగ్ (31), కుస్తీ (51), వాలీబాల్ (29), వెయిట్ లిఫ్టింగ్ (24), షూటింగ్ (8), కబడ్డీ (6), యోగా (10) వంటి మొత్తం 30 స్పోర్ట్స్ కోటాలో ఖాళీలు ఉన్నాయి.
జీతం: నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 (లెవల్-3 పే మ్యాట్రిక్స్) వరకు జీతం లభిస్తుంది. అంతే కాకుండా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఎంపిక విధానం ఈ కింది విధంగా ఉంటుంది.
1.డాక్యుమెంట్ వెరిఫికేషన్
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
- మెరిట్ లిస్ట్
- మెడికల్ టెస్ట్
అప్లికేషన్ ఫీజు:
పురుష అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ. 159 చెల్లించాలి. మహిళా/ ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: డిసెంబర్ 27 నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
చివరి తేదీ: అభ్యర్థులు జనవరి 15, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి ?
అర్హత గల అభ్యర్థులు BSF అధికారిక వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.





