బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF)లో 2025 ఏడాదికి గాను గ్రూప్ సి నాన్ గెజిటెట్, నాన్ మినిస్ట్రీయల్ కింద స్పోర్ట్స్‌కోటాలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు పురుష, మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు..
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీలు–391
పురుషులు– 197
మహిళలు–194
అర్హతలు
టెన్త్ పాసై స్పోర్ట్స్‌లో ప్రతిభావంతులైన వారు అర్హులు. 2023 నవంబర్ 4 నుంచి 2025 నవంబర్ 4వతేదీ వరకు జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారు లేదా పార్టిసిపేట్ చేసిన వారు దరఖాస్తు చేయవచ్చు. వయసు 18–23 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్లు కలిగిన వారికి ఐదేళ్ల మినహాయింపు ఉంటుంది.
క్రీడలు
అథ్లెటిక్స్, బాక్సింగ్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, టేబుల్ టెన్నీస్, బాస్కెట్ బాల్, పుట్‌బాల్, స్విమ్మింగ్, జూడో, షూటింగ్, సైక్లింగ్, బ్యాడ్మింటన్, వెయిల్ లిఫ్టింగ్, హాకీ, ఆర్చరీ
సెలెక్షన్ ప్రాసెస్
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్పోర్ట్స్ మెరిట్ లిస్ట్,, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్
దరఖాస్తులు అక్టోబర్ 16 నుంచి ప్రారంభం అవుతాయి. నవంబర్ 4వతేదీ వరకు అన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.159 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఎలాంటి ఫీజు లేదు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://rectt.bsf.gov.in/





