ఇంటర్ పాసైన విద్యార్థులకు బెస్ట్ కెరీర్ ఛాన్స్.
హైదరాబాద్ లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఈ ఏడాది బీ ఎస్సీ( నర్సింగ్), బాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సులకు నోటిఫికేషన్ జారీ చేసింది.
బీ ఎస్సీ నర్సింగ్ (100 సీట్లు)
బీ ఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల కోర్సు. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కనీసం 45 శాతం మార్కులతో పాసైన ఇంటర్ విద్యార్థులందరూ ఈ కోర్సుకు అర్హులవుతారు.
బాచ్ లర్ ఆఫ్ ఫిజియోథెరఫి (50 సీట్లు)
బీఎస్సీ ఫిజియోథెరపి నాలుగున్నరేళ్ల కోర్సు. ఇందులో ఆరు నెలలు ఇంటర్న్ షిప్. బాటసీ, జువాలసీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ పాసైన వారందరూ అర్హులే.
సైన్స్ సబ్జెక్ట్ లతో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు.
ఆసక్తి అర్హతలున్న విద్యార్థులు అక్టోబర్ 27 వ తేదీ లోగా తమ అప్లికేషన్లను పంపించాలని నిమ్స్ డీన్ ప్రకటన విడుదల చేశారు.
పూర్తి వివరాలు https://nims.edu.in/
నిమ్స్ లో బీ ఎస్సీ నర్సింగ్.. ఫిజియోథెరపీ కోర్సులు
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS