తెలంగాణ రాష్ట్ర మహాత్మా జ్యోతిబాఫులె బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (MJPBCWREIS) ద్వారా నిర్వహించే మహాత్మా జ్యోతిబాఫులె బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అగ్రికల్చర్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల ప్రకటన విడుదలైంది.
వనపర్తి మరియు కరీంనగర్‌లోని వ్యవసాయ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.అర్హులైన అభ్యర్థులు 10.10.2024లోగా దరఖాస్తు చేయాలి. ఎంపికైన బాలికలకు ఉచిత విద్య మరియు వసతి సౌకర్యాలు అందజేయబడతాయి
కోర్సు పేరు: బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్
- వ్యవధి: 4 సంవత్సరాలు
- వనపర్తి (18 సీట్లు – అగ్రిసెట్ కోటా)
- కరీంనగర్ (18 సీట్లు – అగ్రిసెట్ కోటా)
అర్హతలు:
- డిప్లొమా (అగ్రికల్చర్) / డిప్లొమా (సీడ్ టెక్నాలజీ) / డిప్లొమా (ఆర్గానిక్ అగ్రికల్చర్)
- పీజేటీఎస్‌ఏయూ అగ్రిసెట్ 2024 ర్యాంకు తప్పనిసరి.
- 17 నుంచి 22 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
- తల్లిదండ్రుల ఆదాయం:
- పట్టణ ప్రాంతం: రూ.2,00,000 కంటే ఎక్కువ కాకూడదు.
- గ్రామీణ ప్రాంతం: రూ.1,50,000 కంటే ఎక్కువ కాకూడదు.
సెలెక్షన్ ప్రాసెస్:
పీజేటీఎస్‌ఏయూ అగ్రిసెట్ 2024 ర్యాంకు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయింపు ఉంటుంది.
ఫీజు వివరాలు: అప్లికేషన్ ఫీజు: రూ.1000
- తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 10.10.2024
- దరఖాస్తు సవరణ తేదీలు: 11.10.2024 నుండి 12.10.2024 వరకు
.