HomeLATESTపాలిసెట్​ అప్లికేషన్లు ఓపెన్​ కావట్లే.. అసలు కారణమేంటి..?

పాలిసెట్​ అప్లికేషన్లు ఓపెన్​ కావట్లే.. అసలు కారణమేంటి..?

తెలంగాణ పాలిసెట్​ అప్లికేషన్ల ప్రక్రియ ఈనెల 9 నుంచే ప్రారంభమవుతుందని టెక్నికల్​ బోర్డు ప్రకటించింది. కానీ.. తొలి రోజున అప్లికేషన్ల సైట్​ ఓపెన్​ కాలేదు. రెండో రోజు కూడా సైట్​ ఓపెన్​ కాకపోవటంతో టెన్త్ విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. స్టేట్​ టెక్నికల్​ బోర్డు ఇప్పటివరకు అప్లికేషన్ల సబ్​మిట్​ చేసే లింక్​ను అందించకపోవటంతో ఈ సమస్య తలెత్తింది. పాలిసెట్​ అఫిషియల్​ వెబ్​సైట్​ ను ఓపెన్​ చేస్తే.. TS POLYCET Online Application Submission will be available soon అనే మెసేజ్​ ప్రత్యక్షమవుతుంది. మరోవైపు అప్లికేషన్ల ప్రక్రియను వాయిదా వేశారా.. ఎప్పటి నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తారనే విషయంపై పాలిసెట్​ కన్వీనర్​ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. దీంతో టెన్త్ స్టూడెంట్లు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు టెన్త్ హాల్​ టికెట్లు జారీ కాకపోవటంతోనే పాలిసెట్​ అప్లికేషన్లకు బ్రేక్​ పడిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 23 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. 2022 టెన్త్ ఎగ్జామ్ హాల్​ టికెట్లు ఇప్పటికీ ప్రభుత్వం జారీ చేయలేదు. పాలీసెట్​కు అప్లై చేయాలంటే టెన్త్ హాల్​టికెట్ నెంబర్​ నమోదు చేయటం తప్పనిసరి. అందుకే అప్లికేషన్ల సైట్​ను ఓపెన్​ చేయకుండా టెక్నికల్​ బోర్డు అధికారులు పెండింగ్​లో పెట్టినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో టెన్త్ హాల్ టికెట్లు జారీ చేస్తామని ఎస్​ఎస్​సీ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఈ హాల్​టికెట్లు వచ్చేంత వరకు పాలిసెట్​ అప్లికేషన్ల స్వీకరణ ఆగిపోయినట్లేనని అంటున్నారు.

https://polycetts.nic.in/

తెలంగాణ పాలిసెట్​కు సంబంధించి అఫిషియల్​ లింక్​ లు, నోటిఫికేషన్​ ఇక్కడ అందుబాటులో ఉంది.
https://polycet.sbtet.telangana.gov.in/index.html#
https://polycetts.nic.in/

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!