డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ డైరెక్ట్ అడ్మిషన్ల గడువును పొడిగించింది. విద్యార్థుల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం.. తీసుకున్నట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించారు. దీని ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్ (B.A, B.Com, B.Sc), పోస్ట్ గ్రాడ్యుయేట్ (M.A, M.Com, M.Sc, M.B.A, BLISc, MLISc), వివిధ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరాలనుకునే వారు సెప్టెంబర్ 30 లోపు అప్లై చేసుకోవచ్చు.
ట్యూషన్ ఫీజు చెల్లింపు అవకాశం:
కేవలం కొత్త అడ్మిషన్లకే కాకుండా, పాత బ్యాచ్ విద్యార్థులకు కూడా యూనివర్సిటీ ఊరటనిచ్చింది. సీబీసీఎస్ (CBCS) సెకండ్, థర్డ్ ఇయర్ విద్యార్థులు అలాగే పీజీ సెకండ్ ఇయర్ చదువుతూ ట్యూషన్ ఫీజు చెల్లించడం మిస్ అయిన వారికి మరో ఛాన్స్ లభించింది. 2017 నుంచి 2025 మధ్యకాలానికి చెందిన పాత బ్యాచ్ విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజును నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్, టీఎస్ ఆన్ లైన్ ద్వారా సెప్టెంబర్ 30 లోపు చెల్లించాలని సూచించారు.
సంప్రదించాల్సిన నంబర్లు:
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లు లేదా దగ్గరల్లోని స్టడీ సెంటర్ను సందర్శించవచ్చు.
అధికారిక పోర్టల్స్: www.braouonline.in లేదా www.braou.ac.in
ఏవైనా సందేహాలు ఉంటే.. BRAOU కాల్ సెంటర్ నంబర్ 18005990101 లేదా ఇన్ఫర్మేషన్ సెంటర్ నంబర్లు 040-23680222 / 333 / 555 లను కూడా సంప్రదించవచ్చు.





