డా.బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) విద్యార్థులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశాల గడువును సెప్టెంబర్ 12 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.
కొత్తగా అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులతో పాటు, ఇప్పటికే యూనివర్సిటీలో చదువుతున్న వారికి కూడా ఫీజు చెల్లింపు గడువు పొడిగించారు. 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ కోర్సుల్లో చేరిన సెకండ్, థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు, అలాగే అంతకుముందు అడ్మిషన్ పొంది ఫీజు చెల్లించని విద్యార్థులు అందరూ సెప్టెంబర్ 12 లోపు తమ ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు.
ఫీజు చెల్లింపు పద్ధతులు:
నెట్ బ్యాంకింగ్
క్రెడిట్/డెబిట్ కార్డ్
ఆన్‌లైన్ సెంటర్లు
యూనివర్సిటీకి సంబంధించిన వెబ్‌సైట్‌లలో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం కోసం విద్యార్థులు సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించవచ్చు లేదా విశ్వవిద్యాలయ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు.
వెబ్‌సైట్‌లు: www.braouonline.in లేదా www.braou.ac.in
హెల్ప్‌డెస్క్ నంబర్లు: 040-23680 333 / 444 / 555
టోల్‌ఫ్రీ నంబర్: 18005990101 సంప్రదించవచ్చు.





