ఉద్యోగం చేస్తూనే.. ఉన్నత చదువులు పూర్తి చేయాలని కలలు కంటున్నారా? అయితే మీకోసం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ (MBA) అలాగే ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యులర్ కాలేజీలకు వెళ్లే అవకాశం లేని ఉద్యోగులకు, మహిళలకు ఇది చక్కటి అవకాశం. డిగ్రీ అర్హతతో అప్లై చేసుకునే ఈ కోర్సుకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, అర్హతలు, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అర్హత,అడ్మిషన్ విధానం:
ఈ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలనుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాకుండా అభ్యర్థులు యూనివర్సిటీ స్వయంగా నిర్వహించే ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. టీజీ ఐసెట్-2026 (TG ICET) రాసిన అభ్యర్థులకు ఈ ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది.
పరీక్ష తేదీ:
అప్లికేషన్లకు చివరి తేదీ: ఆగస్టు 5 వరకు అభ్యర్థులు సాధారణ ఫీజుతో అప్లై చేసుకోవచ్చు. రూ.500 లేట్ ఫీజుతో అభ్యర్థులు ఆగస్టు 16వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.
హాల్‌టికెట్లు:ఆగస్టు 20 నుంచి అధికారిక వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి.
ఎంట్రన్స్ టెస్ట్ తేదీ: ఇంగ్లీష్ , తెలుగు మీడియంలలో ఆఫ్‌లైన్ (పెన్-పేపర్) విధానంలో ఆగస్టు 23న ప్రవేశ పరీక్ష జరుగుతుంది.
రిజల్ట్:ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్ ఆగస్టు 31న వెల్లడించనున్నారు.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ braou.ac.in/MBA/MBAEntranceHome సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు.





