డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU)2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ కోర్సులకు అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. అప్లై చేసుకోవడానికి ఆగస్టు 7 చివరి తేదీగా నిర్ణయించారు. తెలంగాణలోని అధ్యయన కేంద్రాల ద్వారా మాత్రమే ఈ ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీ (బీ.ఏ, బీ.కాం, బీ.ఎస్సీ) కోర్సులతో పాటు పీ.జీలో ఎం.ఏ (తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, జర్నలిజం), ఎం.కాం, ఎం.ఎస్సీ (బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్), ఎం.ఎల్ఐఎస్సి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. వీటితో పాటు పలు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు:
డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. పదో తరగతి తర్వాత.. రెండేళ్ల కోర్సు, డిప్లొమా, ఐటిఐ, పాలిటెక్నిక్, లేదా ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు. కోర్సుల విద్యార్హతలు, ఫీజుల పూర్తి వివరాల కోసం అభ్యర్థులు www.braouonline.in లేదా www.braou.ac.in వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.
ఇప్పటికే వివిధ కోర్సుల్లో.. చేరి సెకండ్, థర్డ్ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు కూడా తమ ట్యూషన్ ఫీజును ఆగష్టు 7లోపు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో (డిగ్రీ 2021-22 నుంచి 2025-26, పీజీ 2023-24 నుండి 2025-26 బ్యాచ్‌లు) సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా తెలంగాణ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించి తిరిగి అడ్మిషన్ తీసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు.. 7382929570, 040-23680222/333 /555, టోల్‌ఫ్రీ నెంబర్.. 18005990101 లలో సంప్రదించవచ్చు.





