ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు పూర్తి చేయాలనుకునే వారికి డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) ఒక సువర్ణావకాశం కల్పిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ, డిప్లొమా , సర్టిఫికేట్ కోర్సులలో ప్రవేశాల కోసం వర్సిటీ అడ్మిషన్ల ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. కాగా ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ గడువు ముగియనుంది. రేపటితో అడ్మిషన్ ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ పూర్తి చేయడం మంచిది.
కోర్సుల వివరాలు ,అర్హతలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా అనేక రకాల కోర్సులను అందుబాటులోకి తెచ్చారు.
యూజీ ప్రోగ్రామ్స్: ప్రసిద్ధమైన బీఏ (BA), బీకామ్ (BCom), బీఎస్సీ (BSc) డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసిన వారు వీటికి అర్హులు.
పీజీ ప్రోగ్రామ్స్: ఎంఏ (ఇంగ్లీష్, తెలుగు,హిస్టరీ,ఎకనామిక్స్,పొలిటికల్ సైన్స్, సోషియాలజీ,పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్),ఎంఎస్సీ (సైకాలజీ,ఎన్విరాన్మెంటల్ సైన్స్),ఎంకామ్,ఎంబీఏ (MBA),ఎంసీఏ (MCA), బీఎల్ఐఎస్సీ (BLISc) కోర్సులు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు వీటికి అప్లై చేసుకోవచ్చు.
డిప్లొమా & సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్: మల్టీమీడియా, హార్డ్వేర్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రైట్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ వంటి విభిన్న ప్రాక్టికల్ కోర్సులు ఉన్నాయి. కోర్సును బట్టి ఇంటర్ లేదా డిగ్రీ అర్హత అవసరం ఉంటుంది.
ఫీజు :
కోర్సును బట్టి ట్యూషన్ ఫీజు మారుతుంది.
యూజీ కోర్సులు (BA, BCom, BSc): సంవత్సరానికి సుమారు రూ.3,500 నుంచి రూ.5,000 వరకు ట్యూషన్ ఫీజు ఉంటుంది. ప్రాక్టికల్స్ ఉండే బీఎస్సీ కోర్సులకు ఫీజు కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు.
పీజీ కోర్సులు (MA, MCom, MSc): పీజీ కోర్సులకు సెమిస్టర్ లేదా వార్షిక ప్రాతిపదికన రూ.6,000 నుంచి రూ.10,000 వరకు ఫీజు వర్తిస్తుంది. ఎంబీఏ, ఎంసీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులకు ఫీజులు వేరుగా ఉంటాయని గమనించాలి.
డిప్లొమా & సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్: ఈ కోర్సుల ఫీజులు సాధారణంగా రూ. 4,000 నుంచి రూ.8,000 మధ్య ఉంటాయి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అదనంగా వర్తిస్తుంది. ఖచ్చితమైన ఫీజు వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించడం మంచిది.
చివరి తేదీ:
ఈ కోర్సులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 గా నిర్ణయించారు. కాబట్టి వెంటనే అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లు విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, వీకెండ్ తరగతులను అందిస్తాయి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అధికారిక అధ్యయన కేంద్రాలను సంప్రదించవచ్చు.
ఫోన్ నంబర్లు: 040-29880322 / 339 / 441 / 565 లేదా మొబైల్ నంబర్ 7386293670.





