హైదరాబాద్ లోని అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ ఎంబీఏ అడ్మిషన్ల నోటిఫికేెషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఎంట్రెన్స్ పరీక్ష అంబేడ్కర్ వర్శిటీ ప్రధాన కేంద్రం జూబ్లీహిల్స్ లో జరుగుతుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఆన్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది.ఏమైనా సందేహాలుంటే సమీపంలోని స్టడీ సెంటర్లో సంప్రదించాలి. లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు 7382929570/580, 040-23680222/333/444/555, టోల్‌ఫ్రీ నంబర్ 18005990101 కు కాల్ చేయాలి.
https://www.braouonline.in/MBAHHCM/Login.aspx లింక్ పై క్లిక్ చేసి నేరుగా ఎంబీఏ ఎంట్రెన్స్ పరీక్ష కోసం అప్లికేషన్ చేసుకోవచ్చు.
డిగ్రీ, పీజీ అడ్మిషన్ల గడువు పెంపు:
హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువును నవంబర్ 15వ తేదీకి పొడిగించారు.