డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (DR BR Ambedkar Open University – BRAOU) డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు ఒక్క రోజే గడువు మిగిలింది. డిగ్రీలో బీఏ, బికాం, బీఎస్సీ కోర్సులు ఉండగా… పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, పీజ్రీ డిప్లామాతో పాటు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ అకడమిక్ ఇయర్లో డిగ్రీ పీజీ కోర్సుల్లో చేరేందుకు ముందుగా నవంబర్ 5వ తేదీ వరకు యూనివర్సిటీ ఈ అవకాశం కల్పించింది. రూ.200 లేటు ఫీజుతో నవంబర్ 15 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. పూర్తి వివరాలు www.braouonline.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. దగ్గర్లో ఉన్న స్టడీ సెంటర్లలో సంప్రదించి అప్లై చేసుకొనే వీలుంది.