కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) 2026 సంవత్సరానికి గాను పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 250 ఎంట్రీ లెవల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా గేట్.. (GATE)స్కోర్ అవసరం లేకుండానే జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ వంటి కీలక విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా నుంచి పీజీ వరకు వివిధ అర్హతలు కలిగిన అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. అర్హత, ఆసక్తి కలిగి ఉన్న వారు మే 17 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
పోస్టుల వివరాలు, ఖాళీలు:
మొత్తం పోస్టులు – 250
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్): 175 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్): 25 పోస్టులు
అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ అస్యూరెన్స్): 30 పోస్టులు
సెక్రటరీ BPCL: 08 పోస్టులు
ఇతర విభాగాలు (వేసైడ్ ఎమెనిటీస్, లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్) లో మిగిలిన ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు పోస్టును బట్టి కింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
ఇంజనీరింగ్: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ వంటి విభాగాల్లో 3 ఏళ్ల డిప్లొమా కలిగి ఉండాలి.
అకౌంట్స్: ఏదైనా డిగ్రీతో పాటు ఇంటర్ సీఏ లేదా ఇంటర్ CMA చేసి ఉండాలి.
అసోసియేట్ ఎగ్జిక్యూటివ్: M.Sc (కెమిస్ట్రీ) లేదా హిందీలో పీజీ చేసిన వారు అర్హులు.
అనుభవం: అభ్యర్థులకు సంబంధిత రంగంలో కనీసం 3 నుంచి 5 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయస్సు:
పోస్టును బట్టి గరిష్ట వయస్సు 32 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 17 మే వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1180 (GSTతో కలిపి) చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం:
అభ్యర్థుల అప్లికేషన్ ముందుగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత వ్రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. చివరగా మెడికల్ టెస్ట్ నిర్వహించి.. నియామక ఉత్తర్వులు అందజేస్తారు.
అప్లై ఎలా చేయాలి?
అర్హత గల అభ్యర్థులు BPCLఅధికారిక వెబ్‌సైట్ bharatpetroleum.in ద్వారా ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి. అప్లికేషన్ కోసం ఫోటో, సంతకం, సర్టిఫికెట్లు, ఎక్స్‌పీరియన్స్ లెటర్లను సిద్ధంగా ఉంచుకోవాలి.





