HomeJOBSజూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అప్లై చేశారా ?

జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అప్లై చేశారా ?

ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) 2026 సంవత్సరానికి గాను వివిధ ఎంట్రీ లెవల్ విభాగాలలో ఖాళీగా ఉన్న 250 పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ , సెక్రటరీ వంటి కీలక పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. చివరి తేదీని మే 24 వరకు పొడిగించారు.

BPCLరిక్రూట్‌మెంట్ పూర్తి వివరాలు:

మొత్తం పోస్టులు: 250

విభాగాల వారీగా ఖాళీలు:

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్): 175

అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ అస్యూరెన్స్): 30

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్): 25

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (వేసైడ్ ఎమెనిటీస్): 10

సెక్రటరీ: 08

అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (హిందీ ఇంప్లిమెంటేషన్): 02

విద్యార్హతలు:
అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజనీరింగ్), బీకాం, బీబీఏ, బీఎస్సీ, ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) లేదా హిందీలో మాస్టర్స్ చేసి ఉండాలి. అకౌంట్స్ పోస్టులకు ఇంటర్ CA/CMA అర్హత ఉండాలి. విద్యార్హతతో పాటు 3 నుంచి 5 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి.

వయస్సు: ఏప్రిల్ 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 32 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ చివరి తేదీ:
అభ్యర్థులు మే 24 వరకు అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు:

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 1180 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ ,దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థుల ఎంపిక కేవలం మార్కుల ఆధారంగానే ఉంటుంది. అప్లికేషన్ స్క్రీనింగ్ అనంతరం, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ టాస్క్, కేస్ బేస్డ్ డిస్కషన్, చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ అన్ని దశల్లో ప్రతిభ కనబరిచిన వారిని వైద్య పరీక్షల అనంతరం విధుల్లోకి తీసుకుంటారు.

అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు BPCL అధికారిక వెబ్‌సైట్ bharatpetroleum.inలోకి లాగిన్ అయ్యి ‘Careers’ విభాగంలో ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి చేయాలి. అప్లికేషన్ సమయంలో ఫోటో, సంతకం, విద్యార్హత సర్టిఫికెట్లు, స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here