బ్యాంక్ ఆఫ్ బరోడా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 418 మేనేజర్, ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి కాబట్టి అభ్యర్థులు ఫిబ్రవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను బట్టి విద్యార్హతలను నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు:
మొత్తం 418 పోస్టులను మూడు స్థాయిలలో విభజించారు.
ఆఫీసర్ (JMG/S-I): క్లౌడ్ ఇంజనీర్, ఏఐ ఇంజనీర్, డేటా ఇంజనీర్ వంటి పోస్టులు.
మేనేజర్ (MMG/S-II): ఫుల్ స్టాక్ జావా డెవలపర్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఫినాకిల్ డెవలపర్.
సీనియర్ మేనేజర్ (MMG/S-III): ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్ట్, డేటా సైంటిస్ట్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్లకు చివరి తేదీ: ఫిబ్రవరి 19 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పరీక్ష తేదీ: త్వరలోనే అధికారిక వెబ్ సైట్ ద్వారా పరీక్ష తేదీలను వెల్లడిస్తారు.
అర్హతలు:
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఈసీఈ విభాగాల్లో బీఈ/బీటెక్/ఎంటెక్/ ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి.
అనుభవం: ఆఫీసర్ స్థాయి పోస్టులు కనీసం 1 సంవత్సరం. మేనేజర్ స్థాయికి 3 ఏళ్ల అనుభవం ఉండాలి. సీనియర్ మేనేజర్ స్థాయికి 5 ఏళ్ల ఐటీ అనుభవం ఉండాలి.
వయస్సు (01.01.2026 నాటికి):
ఆఫీసర్ పోస్టులు: 22 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
మేనేజర్ పోస్టులు: 24 నుంచి 34 సంవత్సరాల మధ్య మధ్య వయస్సు ఉండాలి.
సీనియర్ మేనేజర్:అభ్యర్థుల వయస్సు 27 నుంచి 37 సంవత్సరాల మధ్య ఉండాలి (ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది).
జీతభత్యాలు:
ఆఫీసర్ (S-I)పోస్టులు: రూ. 48,480 – రూ. 85,920 మధ్య జీతం ఉంటుంది.
మేనేజర్ (S-II): రూ. 64,820 – రూ. 93,960 మధ్య జీతం ఇస్తారు.
సీనియర్ మేనేజర్ (S-III): రూ. 85,920 – రూ. 1,05,280 మధ్య జీతం ఉంటుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక 5 దశల్లో జరుగుతుంది.
ఆన్‌లైన్ పరీక్ష: రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ (మొత్తం 225 మార్కులు).
సైకోమెట్రిక్ టెస్ట్: అవసరాన్ని బట్టి నిర్వహిస్తారు.
వ్యక్తిగత ఇంటర్వ్యూ: మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్.
మెడికల్ ఫిట్‌నెస్.
అప్లికేషన్ ఫీజు:
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 850 చెల్లించాలి.
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్థులు రూ. 175 చెల్లించాలి.
అప్లై చేసుకునే విధానం:
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.bankofbaroda.bank.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.





