బయోస్పియర్ రిజర్వులు – ఇండియా
- 1992లో యూఎన్ఓ ఆధ్వర్యంలో బ్రెజిల్‌లోని రియోడి జనిరోలో జరిగిన ధరిత్రి సమావేశంలో 171 దేశాల భాగస్వామ్యంతో జీవ వైవిధ్య ఒప్పందం జరిగింది.
- ఈ ఒప్పందం ప్రకారం ఆవాసాంతర రక్షణ, ఆవాసేతర రక్షణ చేపడుతారు.
- ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవజాతులను అవే సహజసిద్ధ పరిసరాలలో సంరక్షించడాన్ని ఆవాసాంతర రక్షణ అంటారు.
- ఆవాసాంతర రక్షణలో భాగంగా బయోస్పియర్ రిజర్వ్‌లు, జాతీయ పార్క్‌లు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
- బయోస్పియర్ రిజర్వ్‌లలో జంతువులతోపాటు అన్ని రకాల జీవజాతులను పరిరక్షిస్తారు. టూరిజాన్ని అనుమతించరు.
- దేశం మొత్తం 18 బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి.
- దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి(తమిళనాడు). దీనిని 1986లో ఏర్పాటు చేశారు.
- దేశంలో చివరిగా ప్రకటించిన బయోస్పియర్ రిజర్వ్ పన్నా(మధ్యప్రదేశ్)
- యునెస్కో జాబితాలో దేశంలోని ఏడు బయోస్పియర్ రిజర్వులను చేర్చారు. అవి. నీలగిరి, సుందర్ బన్స్, మన్నార్ సింధుశాఖ, నందాదేవి, నోక్రేక్, పచ్‌మర్హి, సమ్లిపాల్
- ఏడు బయోస్పియర్ రిజర్వ్‌ల కోసం యునెస్కో MAB (Man and Bio sphere Reserve) అనే కార్యక్రమం ప్రారంభించింది.
- దేశంలో అతిపెద్ద బయోస్పియర్ రాణా ఆఫ్ కచ్(12,454 చ.కి.మీ.)
- దేశంలో అతి చిన్న బయోస్పియర్ పన్నా(543 చ.కి.మీ.)
- జాతీయ పార్క్‌లలో జంతువులను సహజంగా రక్షిస్తారు. ఇక్కడ వేట, ప్రైవేట్ కార్యకలాపాలు, కలప సేకరణ నిషేధం
- దేశంలో ఏర్పాటు చేసిన మొదటి జాతీయ పార్క్ – హేలీ (1935). ఆ తర్వాత ఈ జాతీయ పార్క్‌ను జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు అని పిలుస్తున్నారు.
- ప్రస్తుతం దేశంలో 102 జాతీయ పార్కులు ఉన్నాయి.
- దేశంలో అత్యధికంగా అండమాన్ నికోబార్(9), మధ్యప్రదేశ్(9) ఉన్నాయి.
- వన్యమృగ సంరక్షణ కేంద్రాలలో అంతరించిపోయే జీవజాతులను సంరక్షిస్తారు.
- వ్యక్తులకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు ఉంటాయి.
- దేశంలో ప్రస్తుతం 515 వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.
- దేశంలో మొదటి పక్షి సంరక్షణ కేంద్రం వేదాంతగల్ (తమిళనాడు), 1895
- దేశంలో పెద్ద వన్య సంరక్షణ కేంద్రం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సాంక్చురీ 8496 చ.కి.మీ.(మహారాష్ట్ర)
- దేశంలో అధిక వన్యమృగ సంరక్షణ కేంద్రాలు అండమాన్ నికోబార్, మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి.
- తెలంగాణలో కాసు బ్రహ్మానందరెడ్డి, కవ్వాల్, మృగవని, ఏటూరు నాగారం, మహావీర్ హరిణి వనస్థలి, పోచారం, పాకాల, మంజీరలలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.
- ఏదైనా భౌగోళిక ప్రాంతంలో అంతరించి పోయే స్థితిలో ఉన్న జీవజాతులను వాటి సహజ సిద్ద పరిసరాలకు వెలుపల మానవ ప్రమేయంతో సంరక్షించే విధానాన్ని ఆవాసేతర రక్షణ అంటారు.
- ఒకప్పుడు స్థానియమైన అత్యధిక జీవివైవిధ్యత కలిగిన భౌగోళిక ప్రాంతాలు ప్రస్తుతం మానవ చర్యల వల్ల అక్కడి జీవవైవిధ్యత ప్రమాదస్థితిని ఎదుర్కొంటే ఆ భౌగోళిక ప్రాంతాలను ఎకలాజికల్ హాట్‌స్పాట్స్ అంటారు.
- ప్రపంచంలో ఇప్పటివరకు 34 ఎకలాజికల్ హాట్‌స్పాట్లను గుర్తించారు.
- దేశంలో ఈశాన్య హిమాలయాలు, పశ్చిమ కనుమలను ఎకాజికల్ హాట్‌స్పాట్లుగా గుర్తించారు.
- మాజులీ దీవిని ఎకోసెన్సిటివ్ జోన్‌గా గుర్తించారు.
- జల్దపార వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది.
- ప్రఖ్యాతిగాంచిన కన్హా వన్యమృగ సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్‌లో ఉంది.
- కర్ణాటకలోని బందీపూర్ జాతీయ పార్క్ వైల్డ్‌లైఫ్ శాంక్చుయరీకి ప్రసిద్ధి.
- దేశంలో అత్యధిక జీవవైవిధ్యం పశ్చిమ కనుమలలో కలదు.
- మధ్యప్రదేశ్‌లోని పన్నా నేషనల్ పార్క్ గుండా తపతి నది ప్రవహిస్తోంది.
- దేశంలో శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ స్థలం అన్నికంటే పెద్దదైన పులుల సంరక్షణ స్థలం
- దేశంలో ప్రాజెక్ట్ టైగర్ పథకం 1973లో ప్రారంభమైంది.
- దేశంలో అటవీ సంరక్షణ చట్టాన్ని 1980లో చేశారు.
DONT MISS TO READ :
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు