దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) వివిధ యూనిట్లలో “ఆర్టిసన్ గ్రేడ్-IV” ఖాళీల భర్తీ కోసం గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 తయారీ యూనిట్లలో 515 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా సెప్టెంబర్ 12 లోగా అప్లై చేసుకోవచ్చు
పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 515
ట్రేడ్ల వారీగా ఖాళీలు:
ఫిట్టర్: 176
వెల్డర్: 97
మెషినిస్ట్: 51
టర్నర్: 104
ఎలక్ట్రిషియన్: 65
ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 18
ఫౌండ్రీమన్: 4
ఉద్యోగ స్థలాలు (యూనిట్లు):
రాణిపేట్ (BAP)
విశాఖపట్నం (HPVP)
హరిద్వార్ (HERP, HEEP, CFFP)
బెంగుళూరు (EDN)
జగదీష్‌పూర్ (FSIP)
హైదరాబాద్ (HPEP)
భోపాల్ (HEP)
ఝాన్సీ (TP)
తిరుచిరాపల్లి (HPBP)
విద్యార్హత: జనరల్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 60% మార్కులతో, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 55% మార్కులతో టెన్త్ పాసై ఉండాలి. దీంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ/ఎన్టీసీ + ఎన్ఏసీ అర్హత ఉండాలి.
వయస్సు (01.07.2025 నాటికి):
జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్టంగా 27 ఏళ్లు వయస్సు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా 30 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు గరిష్టంగా 32 ఏళ్లు ఉండాలి. అంతే కాకుండా సంబంధిత ట్రేడ్‌లో అనుభవం ఉన్న అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 7 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
జీతం:
ఎంపికైన అభ్యర్థులు మొదటి సంవత్సరం తాత్కాలిక ఉద్యోగులుగా కనీస వేతనంతో పనిచేయాలి. ఆ తర్వాత వారిని ఆర్టిసన్ గ్రేడ్-IVగా రెగ్యులర్ చేస్తారు. రెగ్యులర్ ఉద్యోగులకు వేతనం రూ. 29,500 నుంచి రూ.56,500 వరకు ఉంటుంది. దీంతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది.
స్టేజ్-I: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT): అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్ ఈ CBT స్కోర్ ఆధారంగానే ఉంటుంది.
స్టేజ్-II: స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్: స్కిల్ టెస్ట్ కేవలం అర్హత కోసం మాత్రమే (క్వాలిఫైయింగ్). దీనిలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 1072 (₹600 పరీక్ష ఫీజు + ₹400 ప్రాసెసింగ్ ఫీజు + జీఎస్టీ).
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ. 472 (ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే).
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: సెప్టెంబర్ 12 వ తేదీ లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://bhel.com/ సందర్శించవచ్చు.





