BGSSL recruitment 2026: ప్రభుత్వ రంగ బ్యాంకులో.. ఉద్యోగం చేయాలని కలలు కనే యూత్‌కు ఇది అదిరిపోయే గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన బరోడా గ్లోబల్ షేర్డ్ సర్వీసెస్ లిమిటెడ్ (BGSSL) భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ విభాగాలలో మొత్తం 1,949 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్ కోరుతోంది. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. కాగా అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నోటిఫికేషన్ వివరాలు:
అర్హతలు, వయోపరిమితి:
ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు టెన్త్ అంతే కాకుండా సంబంధిత విభాగాలలో ఇంటర్, లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కొన్ని టెక్నికల్, మేనేజర్ స్థాయి పోస్టులకు నిర్దిష్టమైన అనుభవం, కంప్యూటర్ సర్టిఫికేషన్లు అవసరం. ఉదాహరణకు.. ఆధార్ ఆపరేటర్ పోస్టులకు ఎన్‌ఎస్‌ఈఐటీ సర్టిఫికేట్ తప్పనిసరి. అలాగే ఫీల్డ్ కలెక్షన్, టెలి-కలెక్షన్ రోల్స్‌కు డీఆర్ఏ సర్టిఫికేషన్ ఉండాలి.
పోస్టులు, జాబ్ లోకేషన్స్:
మొత్తం 18 రకాల జాబ్ రోల్స్ కింద 1,949 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలను బట్టి జాబ్ లోకేషన్స్ మారుతుంటాయి. గాంధీనగర్ (GIFT సిటీ), వడోదర, బెంగళూరు, ముంబై (జోగేశ్వరి), పాన్ ఇండియా ప్రాతిపదికన వివిధ ప్రాంతాలలో ఈ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ బ్యాంకింగ్, గ్లోబల్ ట్రేడ్ సర్వీసెస్, హెచ్‌ఆర్ & అడ్మిన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రిటైల్ సేల్స్ వంటి పలు డిపార్ట్‌మెంట్లలో ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతోంది.
అప్లికేషన్ విధానం:
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ చాలా ఈజీ. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్ ద్వారా.. www.bgss.in/careers పేజీ లోకి లాగిన్ అయ్యి, మీకు నచ్చిన జాబ్ రోల్‌ను ఎంచుకుని ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
ఈమెయిల్ ద్వారా.. మీ అప్‌డేటెడ్ రెజ్యూమ్‌ను recruitment@bgss.in ఈమెయిల్ ఐడీకి పంపొచ్చు. ఈమెయిల్ ద్వారా అప్లై చేసేటప్పుడు మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో స్పష్టంగా పేర్కొనాలి.
అప్లికేషన్ చివరి తేదీ:
సెప్టెంబర్ 30 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ సంప్రదించవచ్చు.





