అగ్రికల్చర్ కోర్సులకున్న భారీ డిమాండుతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రతి ఏడాది ఈ సీట్లు పెంచాలని తాజాగా నిర్ణయించింది. గతేడాది 2020- 21 సంవత్సరంలో 710 ఏజీ బీఎస్సీ సీట్లుండగా.. ఈ ఏడాది 760కి పెంచింది. వచ్చే ఏడాది 2022 – 23లో 995కి పెంచబోతోంది.
ఈ యూనివర్సిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో ఐదుచోట్ల వ్యవసాయ కాలేజీలున్నాయి. వీటిలో ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం, వరంగల్, సిరిసిల్ల కాలేజీల్లో 72 చొప్పునే సీట్లు ఉన్నాయి. వచ్చే ఏడాది పాలెం, సిరిసిల్లలో 100, వరంగల్‌లో 75 సీట్లు పెరగనున్నాయి. అత్యధికంగా రాజేంద్రనగర్ కాలేజీలో 320 సీట్లు ఉంటాయి. జగిత్యాల, అశ్వారావుపేటల్లో 200కి పెంచబోతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 3 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటైన తరవాత వాటిలో వ్యవసాయ డిగ్రీ కోర్సులు ప్రారంభించారు. కానీ అవి జయశంకర్ వర్సిటీకి అనుబంధం కావు. ఇతరత్రా ప్రైవేటు కాలేజీల ఏర్పాటుకు అనుమతి లేదు. వ్యవసాయ డిగ్రీ చదివితే ఉద్యోగం గ్యారంటీ అనే ప్రచారం ఎక్కువగా ఉన్నందున ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు కాలేజీల్లో ఈ డిగ్రీలో చేరేందుకు లక్షల రూపాయల డొనేషన్లు కట్టి తెలుగు విద్యార్థులు చేరుతున్నారు.
తెలంగాణలో ప్రైవేటు కాలేజీలు లేకపోవడం, జయశంకర్ వర్సిటీలో ఇంతకాలం 710 సీట్లు మాత్రమే ఉండటం వల్ల తీవ్రమైన పోటీ ఉంది. కాలేజీలు, సీట్ల సంఖ్య ఇంకా పెంచాలని ఎప్పటినుంచో డిమాండు ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రైవేటు వర్సిటీల్లోనూ చేరేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు.
కానీ 3 ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో నిర్వహిస్తున్న ఏజీ బీఎస్సీ కోర్సులకు ఇంతవరకూ ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) గుర్తింపు రాలేదు. జయశంకర్ వర్సిటీ కోర్సులకు మాత్రమే ఉంది. గుర్తింపు ఉన్న డిగ్రీ చదివిన వారికే జయశంకర్ వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ సీట్లు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భర్తీచేసే వ్యవసాయాధికారి పోస్టులకు సైతం వారినే ఎంపిక చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జయశంకర్ వర్సిటీ నిర్వహిస్తున్న ఏజీ బీఎస్సీ కోర్సులకే అధిక డిమాండు ఉన్నందునే సీట్లు పెంచుతున్నట్లు వర్సిటీ వీసీ వి.ప్రవీణ్‌రావు తెలిపారు.
అగ్రికల్చర్ డిగ్రీ ఉంటే జాబ్ గ్యారంటీ.. ఈ ఏడాది నుంచి సీట్ల పెంపు
RELATED ARTICLES
PRACTICE TEST
TELANGANA HISTORY
LATEST
CURRENT AFFAIRS
TELANGANA MAGAZINE
తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.





