ఐటీఐ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ‘బిఇఎమ్ఎల్ లిమిటెడ్’ (BEML Limited) నాన్-ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు మొత్తం 362 ఆపరేటర్ (టెన్యూర్ బేసిస్) పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. కాగా అర్హత ఉన్న అభ్యర్థులు జులై 10వ తేదీ వరకు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నోటిఫికేషన్ వివరాలు:
మొత్తం 362 పోస్టులలో అత్యధికంగా ఫిట్టర్ ట్రేడ్‌లో ఖాళీలు ఉన్నాయి. ట్రేడ్ల వారీగా ఖాళీలు ఇవే..
ఐటీఐ -ఫిట్టర్: 127 పోస్టులు
ఐటీఐ-టర్నర్: 93 పోస్టులు
ఐటీఐ-ఎలక్ట్రీషియన్: 58 పోస్టులు
ఐటీఐ-వెల్డర్: 44 పోస్టులు
ఐటీఐ-మెషినిస్ట్: 40 పోస్టులు
అర్హతలు:
అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో కనీసం 60% మార్కులతో ఐటీఐ పాసై ఉండాలి. NCVT జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NTC) ఉండాలి. దీంతో పాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ ద్వారా నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కూడా పొంది ఉండాలి. (SC, ST, PwD అభ్యర్థులకు మార్కులలో 5% సడలింపు ఉంటుంది. అంటే 55% మార్కులు వస్తే సరిపోతుంది).
వయోపరిమితి:
జులై 10 నాటికి జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల వయస్సు 29 ఏళ్లకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు (32 ఏళ్ల వరకు), ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు (34 ఏళ్ల వరకు) వయోసడలింపు లభిస్తుంది.
అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 200. మిగిలిన వారికి ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థులను 2 గంటల పాటు జరిగే కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి (జనరల్ అవేర్‌నెస్-20, ఇంగ్లీష్ & రీజనింగ్-20, సంబంధిత ఐటీఐ సబ్జెక్ట్-60). ఈ పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ,మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఫైనల్ ఆఫర్ లెటర్ ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు & ఎలా అప్లై చేయాలి:
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జులై 10. అర్హత గల అభ్యర్థులు BEML అధికారిక వెబ్‌సైట్ www.bemlindia.in లోని కెరీర్స్ (Careers) పేజీకి వెళ్లి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.





