ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (BEL Job Notification) విడుదల చేసింది. మొత్తం 111 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 111 ఖాళీలకు గాను 50 ట్రైన్ ఇంజనీర్-1 ఖాళీలు కాగా.. మరో 61 ప్రాజెక్ట్ ఇంజనీర్-1 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆయా సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 23లోగా దరఖాస్తులను (BEL Job Application) సమర్పించాల్సి ఉంటుంది.
ఇంకా వయో పరిమితి విషయానికి వస్తే.. ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు అక్టోబర్ 1 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఖాళీలకు అప్లై చేసుకునే వారి వయస్సు 32 ఏళ్లలోపు ఉండాలి.
వేతనాల వివరాలు: ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.55 వేల వరకు వేతనం ఉంటుంది.
అభ్యర్థుల ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.