భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) బెంగళూర్ యూనిట్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 162 ఇంజినీర్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 4 తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుదాం.
పూర్తి వివరాలు:
పోస్టుల వారీగా ఖాళీలు..
ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ : 80 పోస్టులు(ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్)
టెక్నీషియన్ ‘C’: 82 పోస్టులు ( ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్)
అర్హత:
ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ఇంజినీరింగ్‌లో 3 సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
టెక్నీషియన్ ‘C’పోస్టులు: SSLC + ITI + 1 సంవత్సరం అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. లేదా, SSLC+3 సంవత్సరాల నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: అక్టోబర్ 01, 2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు.. గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు: GEN/OBC/EWS అభ్యర్థులు.. రూ. 590 చెల్లించాలి. SC/ST/PwBD/మాజీ సైనికులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం: అర్హత ఉన్న అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) కోసం షార్ట్‌లిస్ట్ చేస్తారు. పరీక్ష బెంగళూర్‌లో నిర్వహిస్తారు.
ఎలా అప్లై చేయాలి:
అభ్యర్థులు BEL అధికారిక వెబ్‌సైట్ bel-india.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.





