HomeLATESTబెల్​లో 247 ట్రెయినీ ఇంజినీర్ జాబ్స్​

బెల్​లో 247 ట్రెయినీ ఇంజినీర్ జాబ్స్​


బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ప్రాజెక్ట్​ ఇంజినీర్​, ట్రెయినీ ఇంజినీర్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

ఖాళీలు: 247

ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు: 67

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్, సివిల్‌.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 1 జనవరి 2022 నాటికి 32 ఏళ్లు మించరాదు.

సాలరీ: మొదటి ఏడాది నెలకి రూ.40,000, రెండో ఏడాది నెలకి రూ.45,000, మూడో ఏడాది నెలకి రూ.50,000, నాలుగో ఏడాది నెలకి రూ.55,000 చెల్లిస్తారు.

ట్రెయినీ ఇంజినీర్లు: 169

విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్‌, కంప్యూటర్ సైన్స్‌, ఎలక్ట్రికల్‌, ఆర్కిటెక్చర్‌.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌)/ బీఆర్క్‌ (ఐదేళ్లు) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి.

వయసు: 01.01.2022 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

సాలరీ: మొదటి ఏడాది నెలకి రూ.30,000, రెండో ఏడాది నెలకి రూ.35,000, మూడో ఏడాది నెలకి రూ.40,000.

ట్రెయినీ ఆఫీసర్లు (ఫైనాన్స్‌): 11

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఫైనాన్స్‌ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి.

వయసు: 1 జనవరి 2022 నాటికి 28 ఏళ్లు మించరాదు.

సాలరీ: మొదటి ఏడాది నెలకి రూ.30,000, రెండో ఏడాది నెలకి రూ.35,000, మూడో ఏడాది నెలకి రూ.40,000.

సెలెక్షన్​ ప్రాసెస్​: బీటెక్‌/ బీఎస్సీ/ ఎంబీఏలో సాధించిన మెరిట్‌ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు: ఆన్‌లైన్​లో అప్లై చేసుకోవాలి.
చివరి తేది: 4 ఫిబ్రవరి
వెబ్​సైట్​: www.bel-india.in

Advertisement

కోస్ట్‌ గార్డ్‌ రీజియన్‌లో సివిలియన్​ పోస్టులు​


చెన్నైలోని కోస్ట్‌ గార్డ్‌ రీజియన్‌ (ఈస్ట్‌) సివిలియన్‌ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

ఖాళీలు: 80

పోస్టులు: ఇంజిన్‌ డ్రైవర్‌, సారంగ్‌ లస్కర్‌, స్టోర్‌ కీపర్‌, సివిలియన్‌ మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్, ఫైర్‌మెన్‌, ఐస్‌ ఫిట్టర్‌, స్ప్రే పెయింటర్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్, షీట్‌ మెటల్‌ వర్కర్‌.

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష, ట్రేడ్‌/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు: ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.

చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (2022 జనవరి 22-28)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్​: కమాండర్‌, కోస్ట్‌ గార్డ్‌ రీజియన్‌ (ఈస్ట్‌), నాపైర్‌ బ్రిడ్జి దగ్గర, సెయింట్‌ జార్జ్‌ పోర్ట్‌, చెన్నై-600009.

వెబ్​సైట్​: www.indiancoastguard.gov.in

బీపీసీఎల్‌లో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్స్​


ముంబయిలోని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) జూనియర్​ ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: ఇంజినీరింగ్‌ డిప్లొమా/గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/ బీటెక్‌/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 1 ఫిబ్రవరి నాటికి 45 ఏళ్లు మించకుండా ఉండాలి.

సాలరీ: నెలకి రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు చెల్లిస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్​: అప్లికేషన్‌ స్క్రీనింగ్‌, రాత పరీక్ష/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, కేస్‌ బేస్డ్‌ డిస్కషన్‌, గ్రూప్‌ టాస్క్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు: ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి.
చివరి తేది: 7 ఫిబ్రవరి
వెబ్​సైట్: www.bharatpetroleum.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!