HomeJOBSబీడీఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. అప్లై చేశారా ?

బీడీఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. అప్లై చేశారా ?

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL).. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా 80 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్ విభాగాల్లో అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల వారు డిసెంబర్ 29 లోపు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేసుకోవాలి.

పూర్తి వివరాలు:

సంస్థ పేరు- భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)

పోస్టు పేరు- మేనేజ్‌మెంట్ ట్రైనీ

మొత్తం పోస్టులు- 80

వెబ్‌సైట్- https://bdl-india.in

విభాగాల వారీగా పోస్టులు:

MT (ఎలక్ట్రానిక్స్): 32

MT (మెకానికల్): 27

MT (ఎలక్ట్రికల్): 06

MT (కంప్యూటర్ సైన్స్): 04

MT (ఫైనాన్స్): 05

MT (హ్యూమన్ రిసోర్సెస్): 02

ఇతర విభాగాలు (సివిల్, కెమికల్, మెటలర్జీ): 4

అర్హతలు:

విద్యార్హతలు:

సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో (SC/ST అభ్యర్థులకు 55%) కింది విద్యార్హతలు కలిగి ఉండాలి.

ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధిత బ్రాంచ్‌లో బీఈ / బీటెక్ / బీఎస్సీ(Engg) లేదా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.

మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టులకు CA / ICWAI ఉత్తీర్ణత లేదా ఫైనాన్స్‌లో ఫస్ట్ క్లాస్ ఎంబీఏ/పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

మేనేజ్‌మెంట్ ట్రైనీ (HR) పోస్టులకు HR / PM & IR లో ఫస్ట్ క్లాస్ ఎంబీఏ / ఎంఎస్ డబ్ల్యూ / పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: అభ్యర్థులు 27 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

అప్లికేషన్ చివరి తేదీ: అభ్యర్థులు డిసెంబర్ 29 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఎంపిక విధానం:

ఎంపిక రెండు దశల్లో ఉంటుంది.

రాత పరీక్ష (CBoT): కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఇందులో 150 మార్కులకు గానూ 150 ప్రశ్నలు ఉంటాయి. (100 సబ్జెక్ట్ రిలేటెడ్, 50 జనరల్ ఆప్టిట్యూడ్). ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.

ఇంటర్వ్యూ: రాత పరీక్షలో మెరిట్ సాధించిన వారిని 1:10 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి పిలుస్తారు.

వెయిటేజీ: రాత పరీక్షకు 85%, ఇంటర్వ్యూకి 15% ప్రాధాన్యత ఇస్తారు.

ఉద్యోగ ప్రాంతాలు: తెలంగాణలోని హైదరాబాద్ (కార్పొరేట్ ఆఫీస్ & కంచన్‌బాగ్), భానూర్ (సంగారెడ్డి), ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి), ఏపీలోని వైజాగ్ యూనిట్, ఢిల్లీ లైజన్ ఆఫీస్, యూపీలోని ఝూన్సీ (కొత్త ప్రాజెక్టులు).అవసరాన్ని బట్టి దేశంలోని ఇతర ప్రాంతాలలో లేదా విదేశాలలో కూడా అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది.

అప్లై చేసుకోవడం ఎలా?

అభ్యర్థులు BDL అధికారిక వెబ్‌సైట్ https://bdl-india.in ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here