ఇంజనీరింగ్, డిప్లొమా పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థలో.. కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. హైదరాబాద్ కంచన్‌బాగ్ పరిధిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా.. గ్రాడ్యుయేట్, డిప్లొమా విభాగాల్లో మొత్తం 147 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో.. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు 122 ఉండగా, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు 25 ఉన్నాయి. ఎంపికైన.. వారికి నెలకు స్టైపెండ్ రూపంలో ఆర్ధిక సహాయం కూడా లభిస్తుంది.
అర్హతలు, ఖాళీలు:
బీఈ, బీటెక్ లేదా డిప్లొమా పూర్తయిన అభ్యర్థులు..ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ముఖ్యంగా.. సివిల్, ఎలక్ట్రికల్ అండ్.. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీతో పాటు డిసిసిపి వంటి ఇంజనీరింగ్ విభాగాల్లో.. ఈ అప్రెంటిస్‌షిప్ ఖాళీలు అందుబాటులో.. ఉన్నాయి.
నెలవారీ స్టైపెండ్, ఫీజు:
ట్రైనింగ్ సమయంలో.. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ. 12,300, అలాగే..డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు నెలకు రూ. 10,900 చొప్పున స్టైపెండ్ లభిస్తుంది. ఈ మొత్తంలో.. 50 శాతం నిధులను BDL సంస్థ నేరుగా ఇస్తే..మిగిలిన 50 శాతం మొత్తాన్ని బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్ DBT విధానంలో నేరుగా అభ్యర్థి బ్యాంక్ ఖాతాలోనే.. జమ చేస్తుంది. అదనపు ప్రయోజనం ఏటంటే.. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
అప్లికేషన్ ప్రక్రియ,చివరి తేదీ:
జులై 22న ప్రారంభమైన ఈ ఆన్లైన్ అప్లై ప్రక్రియకు ఆగస్టు 6వ తేదీ చివరి గడువుగా ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్ (nats.education.gov.in)లో తమ వివరాలతో.. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చిన ఎన్రోల్మెంట్ ఐడీతో పాటు అప్డేటెడ్.. రెజ్యూమ్‌ను hrkbu-app@bdl-india.in అనే అధికారిక ఈమెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది.





