తెలంగాణలో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షలతో పాటు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణను అందిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులకు ఆగస్టు 25 నుండి 150 రోజుల పాటు శిక్షణను అందిస్తారు. ఈ కోచింగ్‌లో చేరిన అభ్యర్థులకు నెలకు రూ.1000 చొప్పున స్టైఫండ్ అందిస్తామని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో మొత్తం (12) టీజీ బీసీ స్టడీ సర్కిళ్లలో (I,II,III,IV), RRB, SSC మరియు బ్యాంకింగ్ రిక్రూట్మెంట్లకు ఫౌండేషన్ కోర్సు ఉచిత కోచింగ్ ప్రోగ్రాం” ఆగస్ట్ 25వ తేదీన ప్రారంభమవుతుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా అప్లై చేసుకోవాలి. జులై 16వ తేదీ నుంచి ఆగస్ట్ 11వ తేదీ వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉచిత కోచింగ్‌లో చేరాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలి. డిగ్రీ పరీక్షలో అత్యధిక శాతం మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక విధానం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1000 చొప్పున అయిదు నెలల పాటు స్టైఫండ్ మంజూరు చేస్తారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెం: 040- 24071178 ను సంప్రదించాలి.





