రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం బాసరలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ లో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూన్ 1 నుంచి 26 వరకు అర్హులైన విద్యార్థులు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు, వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. వెంకటరమణ సోమవారం హైదరాబాద్ లో వివరాలను వెల్లడించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా 1500సీట్లు ఉందుబాటులో ఉన్నాయని తెలిపారు.
అందులో 15శాతం సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడుతారు. ఇంటర్ లో వచ్చిన మార్కుల ఆధారంగా బీటెక్ లో పలు బ్రాంచీల్లోని సీట్లను భర్తీ చేస్తారు. తొలి ఏడాదికి ఫీజు రూ.37 వేలు ఉంటుంది. ఫీజు రీయింబర్స్ మెంట్ అర్హత ఉన్నవారు ఆ ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. దానికి తోడు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1000, కాషన్ డిపాజిట్ రూ.2 వేలు, ఆరోగ్య బీమా రూ. 700, మొత్తం రూ. 3700 అదనంగా చెల్లించవలిసి ఉంటుంది.
దరఖాస్తులు:
-జూన్ 1 నుంచి సాయంత్రం 5గంటల వరకు
-సీట్ల కేటాయింపు జులై 3 నుంచి
-ధ్రువపత్రాల పరిశీలన జులై 8 నుంచి 10 వరకు ఉంటుంది.
ఇతర ముఖ్యమైన విషయాలు :
-ఈ ఏడాది తొలి ప్రయత్నంలో 10వ తరగతి ఉత్తీర్ణత పొందినవారే అర్హులు. వారి వయస్సు జూన్ 1వ తేదీ నాటికి 18ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 21ఏళ్ల వరకు మినహాయింపు ఉంటుంది.
-గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు 5శాతం సీట్లు సూపర్ న్యూమరీ కింద కేటాయించనున్నారు. పూర్తి వివరాలను ఆర్జీయూకేజీ వెబ్ సైట్లో చూడవచ్చు.