బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM)అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 600 పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యార్హతలకు సంబంధించిన వివరాలను పూర్తి నోటిఫికేషన్ ద్వారా త్వరలోనే వెల్లడిస్తారు. అభ్యర్థులు జనవరి 15వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. జనవరి 25వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీలు: 600
పోస్టు పేరు: అప్రెంటిస్
అర్హతలు:
ప్రస్తుతానికి షార్ట్ నోటిఫికేషన్‌ను మాత్రమే విడుదలైంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విద్యార్హతలు (సాధారణంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ), వయోపరిమితి, అప్లికేషన్ ఫీజుకు సంబంధించిన వివరాలు జనవరి 15న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: అభ్యర్థులు జనవరి 15వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ: జనవరి 25వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఎంపిక విధానం:
ఎంపిక విధానం సాధారణంగా ఆన్‌లైన్ పరీక్ష లేదా అకడమిక్ మెరిట్ ఆధారంగా ఉంటుంది. దీనితో పాటు స్థానిక భాషా పరిజ్ఞానం (Local Language Test) కూడా కీలకం కానుంది. ఎంపికైన అభ్యర్థులకు నిర్ణీత కాలం పాటు శిక్షణ ఉంటుంది. ఎంపికైన వారికి ప్రతి నెలా స్టైపెండ్ ఇస్తారు.
అప్లికేషన్ ప్రక్రియ:
ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ bankofmaharashtra.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
1.ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోని ‘Careers’ సెక్షన్‌కు వెళ్లాలి.
2. తర్వాత అప్రెటిస్ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
3. ఫోటో, సంతకం, అవసరమైన సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాలి.
4. ఫీజు చెల్లించి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.





