బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank Of Maharashtra) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. చాలా రోజుల తర్వాత బ్యాంక్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. మొత్తం 551 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 6న అంటే.. ఈ రోజు ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 23ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హతలు: ఆఫసీర్ స్కేల్ I, III, IV & V విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు. వేర్వేరు ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1180 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, PwBD అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. వారు కేవలం రూ.118 చెల్లిస్తే సరిపోతుంది.
ఎలా అప్లై చేయాలంటే:
Step 1: అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ bankofmaharashtra.in ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం పేజీలో కేరీర్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ విభాగంలోని కరెంట్ ఓపెనింగ్స్ పై క్లిక్ చేయాలి.
Step 3: తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపి, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
Step 4: భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ ను భద్రపరుచుకోవాలి.