Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSబ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఖాళీలు

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఖాళీలు

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 24వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాలి.

ఖాళీలు: మొత్తం 600 ఖాళీలు (ఎస్సీ- 65; ఎస్టీ- 48; ఓబీసీ- 131; ఈడబ్ల్యూఎస్‌- 51; యూఆర్‌- 305) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకు శాఖల్లో 11, తెలంగాణలోని బ్యాంకు శాఖల్లో 16 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. 30- జూన్​ 2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది. స్టైపెండ్ నెలకు రూ.9000 చెల్లిస్తారు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏడాది ట్రైనింగ్​ ఉంటుంది. 12వ తరగతి (హెచ్‌ఎస్‌సీ/ 10+2)/ డిప్లొమా మార్కులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల సెలెక్షన్​ ఉంటుంది.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో అక్టోబర్​ 14 నుంచి అక్టోబర్​ 24 వరకు దరఖాస్తు చేసుకోవాలి. యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీలకు రూ.150 + జీఎస్‌టీ, ఎస్సీ/ ఎస్టీలకు రూ.100 + జీఎస్‌టీ అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. దివ్యాంగులకు మినహాయింపు ఉంటుంది. పూర్తి సమాచారం కోసం www.bankofmaharashtra.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!