బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) గతంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 400 అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 10వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి. ఎంపికైన వారికి ఒక ఏడాది శిక్షణతో పాటు స్టైఫండ్ ఇస్తారు.
పూర్తి వివరాలు:
సంస్థ: బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI)
మొత్తం ఖాళీలు: 400 పోస్టులు
విద్యార్హత: అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. (01.04.2021 – 01.12.2025 మధ్య)
వయస్సు: (01.12.2025 నాటికి) అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ చివరి తేదీ: అభ్యర్థులు జనవరి 10వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
స్టైఫండ్: అభ్యర్థులకు 13 వేల స్టైఫండ్ ఇస్తారు.
శిక్షణా సమయం: 1 ఏడాది పాటు అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులు రూ. 600 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 400 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు. రూ. 800 + జీఎస్టీ చెల్లించాలి.
ఎంపిక విధానం:
ఆన్‌లైన్ రాత పరీక్ష: మొత్తం 100 మార్కులకు (జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ & రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్) పరీక్ష ఉంటుంది. తర్వాత స్థానిక భాషా ప్రావీణ్యం చెక్ చేస్తారు.
అప్లికేషన్: అప్లై చేసుకోవాలకునే అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్ (nats.education.gov.in)లో రిజిస్టర్ చేసుకోవాలి.
అనంతరం బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ bankofindia.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.





